‘చైత్ర’.. ‘సెల్ఫిష్’ నుంచి ఇవానా పాత్ర పరిచయం
కాశీ విశాల్ దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్‌పై దిల్ రాజు-శిరీష్ నిర్మిస్తున్న యూత్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ ‘సెల్ఫిష్’.
దిశ, సినిమా: కాశీ విశాల్ దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్‌పై దిల్ రాజు-శిరీష్ నిర్మిస్తున్న యూత్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ ‘సెల్ఫిష్’. ఆశిష్ రెడ్డి హీరోగా వస్తున్న సినిమానుంచి హీరోయిన్గా నటిస్తున్న ఇవానా పాత్రను ‘చైత్ర’గా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో ఏదో ఆందోళనలో ఉన్నట్లు కనిపించిన నటి ఐడీ కార్డు ఆధారంగా ఫైనాన్సియల్ ఎనలిస్ట్‌గా నటించినట్లు తెలుస్తోంది. ఇక ఆమె చాలా సింపుల్ లుక్‌లో దర్శనమివ్వగా.. నటిని తదేకంగా చూస్తున్న ఆశిష్.. గిరజాల జుట్టు, గడ్డంతో మోడిష్‌గా అట్రాక్ట్ చేస్తున్నాడు. అలాగే ‘రిజర్వ్డ్ ఫర్ మై లవ్’ అనే గూగుల్ సెర్చ్ స్పేస్ పోస్టర్‌పై కనిపిస్తుండగా.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. మిక్కీ జె.మేయర్ సంగీతం అందిస్తున్నాడు.
Also Read...
‘ఉగ్రం’.. ‘నాంది’ కంటే పదిరేట్లు ఉత్కంఠగా ఉంటుంది: అల్లరి నరేష్