నటిపై లైంగిక వేధింపులు.. ముగ్గురు నిర్మాతలపై ఎఫ్‌ఐఆర్ నమోదు
యాక్ట్రెస్ జెన్నీఫర్ మిస్త్రీ భన్సీవాల్ ‘తారక్ మెహతా కా ఉల్టా ఛష్మా’ నుంచి 15 ఏళ్ల జర్నీ తర్వాత తప్పుకుంది.
దిశ, సినిమా: యాక్ట్రెస్ జెన్నీఫర్ మిస్త్రీ భన్సీవాల్ ‘తారక్ మెహతా కా ఉల్టా ఛష్మా’ నుంచి 15 ఏళ్ల జర్నీ తర్వాత తప్పుకుంది. ఇందుకు కారణం సెక్సువల్ హరాజ్మెంట్ అని ఓపెన్‌గా చెప్పింది. నిర్మాత అసిత్ కుమార్ మోడీ, ఆపరేషన్ హెడ్ సోహెల్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జతిన్ తనను లైంగికంగా వేధించారని ఆరోపించింది. ప్రారంభంలో ఈ అలిగేషన్స్‌పై కాస్త నెగెటివిటీ వచ్చినా.. మరో యాక్ట్రెస్ ప్రియా అహుజా, ఎగ్జిక్యూటివ్ ఫిమేల్ డైరెక్టర్స్ ఇదే చెప్పుకురావడంతో ట్రోలింగ్ తగ్గింది. కాగా ఆమె ఫిర్యాదు చేసిన నెల రోజుల తర్వాత తాజాగా ఈ ముగ్గురిపై ముంబై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఐపీసీ సెక్షన్స్ 354, 509 కింద కేసు ఫైల్ చేసినట్లు సమాచారం.
Also Read.