తమిళ సినిమాల్లో తమిళులే నటించాలి.. సెల్వమణి సంచలన వ్యాఖ్యలు
ఏపీ మంత్రి రోజా భర్త, ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాన్ ఇండియా మోజులో పడి తమ సినిమాలు తమ ఉనికిని కోల్పోతున్నాయని అన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మంత్రి రోజా భర్త, ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాన్ ఇండియా మోజులో పడి తమ సినిమాలు తమ ఉనికిని కోల్పోతున్నాయని అన్నారు. తమిళ సంప్రదాయాలు, భాషపై మెల్ల మెల్లగా మక్కువ పోతోందని తెలిపారు. తమిళ సినిమాల్లో తమిళులకే అవకాశం ఇవ్వాలని తాను చేసిన వ్యాఖ్యలను తెలుగు, కన్నడ, మలయాళ పరిశ్రమల నుంచి ఖండించారని వెల్లడించారు. తమిళ సినిమాల్లో తమిళ టెక్నీషియన్లకే అవకాశం ఇవ్వాలని తాను చేసిన వ్యాఖ్యలకు ఇంకా కట్టుబడి ఉన్నానని షాకింగ్ కామెంట్స్ చేశారు.
కాగా, గతంలో బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సెల్వమణి వ్యాఖ్యలపై స్పందించిన విషయం తెలిసిందే. సినిమా అనేది వినోదం మాత్రమే.. దాంట్లో ప్రాంతీయ భేదాలు చూడొద్దని పవన్ అన్నారు. బ్రో చిత్రానికి అన్ని భాషల వాళ్లను తీసుకున్నామని గుర్తుచేశారు. కళాకారులకు ఒక ప్రాంతానికి, ఒక మతానికి, ఒక కులానికి మాత్రమే పరిమితం చేయొద్దని పవర్ స్టార్ సూచించారు. తాజాగా.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు స్పందించిన సెల్వమణి తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ప్రకటించారు. దీనిపై మిగతా ఇండస్ట్రీల వాళ్లు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.