ఫాతిమా, విజయ్.. ‘బిచ్చగాడు 2’ ప్రాణం పెట్టి తీశారు : ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అడివి శేష్‌

విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో వస్తున్న ‘బిచ్చగాడు 2’ మే 19న విడుదల కాబోతోంది.

Update: 2023-05-17 10:58 GMT

దిశ, సినిమా: విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో వస్తున్న ‘బిచ్చగాడు 2’ మే 19న విడుదల కాబోతోంది. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్‌పై ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన చిత్రంలో కావ్యా థాపర్ కథానాయిక. తెలుగులో ఉషా పిక్చర్స్ బ్యానర్‌పై విజయ్ కుమార్, వీరనాయుడు రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్‌కు అడివి శేష్‌, ఆకాష్ పూరిలు ముఖ్య అతిథులుగా వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన అడవి శేషు.. ‘మనమే కథలు రాస్తున్నాం.. సినిమాలు చేస్తున్నాం.. అనుకున్నా.

కానీ విజయ్‌ మ్యూజిక్, ఎడిటింగ్ కూడా చేస్తున్నారు. ‘బిచ్చగాడు’లో నెంబర్ ప్లేట్ సీన్ నాకు చాలా ఇష్టం. సెకండ్ పార్ట్ బిగ్ హిట్ అవుతుంది’ అన్నాడు. అలాగే ‘బిచ్చగాడు’ టైటిల్ వినగానే ఇదేం పేరు అనుకున్నానన్న ఆకాష్ పూరి.. రికార్డులు క్రియేట్ చేసిన తర్వాత చిన్న సినిమాలకు ‘బిచ్చగాడు’ ఫ్లాట్‌ఫాంలా మారిందన్నాడు. చివరగా తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానానికి విజయ్ థాంక్స్ చెప్పగా.. ఫస్ట్ పార్ట్ లాగే సెకండ్ పార్ట్ కూడా అందరికీ నచ్చుతుందని, బిగ్ హిట్ చేయాలని చిత్ర బృందం కోరింది.

Also Read..

ఆ క్షణం నా జీవితం ముగిసిందనుకున్నా.. విజయ్ యాక్సిడెంట్‌పై ఫాతిమా 

Tags:    

Similar News