టాలీవుడ్లో తీవ్ర విషాదం.. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ఆత్మహత్య
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల ఆత్మహత్య చేసుకున్నారు. బంజారాహిల్స్‌లో..
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల ఆత్మహత్య చేసుకున్నారు. బంజారాహిల్స్‌లోని తన ఫ్లాట్‌లో బాత్రూంలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆమె ఆత్మహత్యకు పాల్పడిన బాత్రూంలో కార్బన్ మోనాక్సైడ్ బాటిల్‌ను పోలీసులు గుర్తించారు. బహుశా స్టీంలో కార్బన్ మోనాక్సైడ్ కలిపి దానిని పీల్చి ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ విషయంపై పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మరణానికి అసలు కారణం ఏమై ఉండొచ్చని వారు విచారణ చేస్తున్నారు. అయితే పోలీసుల ప్రాథమిక విచారణలో ఆమె డిప్రెషన్ కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 30 మంది ఫ్యాషన్ డిజైనర్ల జాబితాలో ప్రత్యూష ఒకరు. ఆమె ప్రతిభకు ఆమెకు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు లభించింది. స్టార్ హీరో, హీరోయిన్లకు డ్రెస్ డిజైన్ చేశారు.