గుడి అని కూడా చూడకుండా పూజా హెగ్డే పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఫ్యాన్స్

సక్సెస్‌ఫుల్ హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. భాషతో సంబంధం లేకుండా దాదాపు స్టార్ హీరోల అందరితో నటించి ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకుంది.

Update: 2023-09-24 09:15 GMT

దిశ, సినిమా: సక్సెస్‌ఫుల్ హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. భాషతో సంబంధం లేకుండా దాదాపు స్టార్ హీరోల అందరితో నటించి ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా పూజా హెగ్డే ముంబైలోని లాల్‌బగీచా దేవాలయానికి వెళ్లి విఘ్నేశ్వరుడిని దర్శించుకుంది. ఆమెతోపాటు శిల్పా శెట్టి వాళ్ల ఫ్యామిలీ కూడా వచ్చారు. అయితే దేవాలయానికి వచ్చిన ఆమెను చూడటానికి అభిమానులు అంత ఒక్కసారిగా ఎగబడ్డారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ అందులో కొందరు అభిమానులు ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఇక ఇది చూసిన చాలా మంది పూజా హెగ్డే ఫ్యాన్స్‌పై కోపంతో ఉన్నారు. అభిమానులంటే వారికి మద్దతివ్వాలి కానీ ఇలా వారిని ఇబ్బందులకు గురిచేయకూడదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News