అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందుకున్న సౌత్ యాక్టర్స్.. లిస్ట్‌లో లెజెండరీస్

రామ జన్మ భూమిలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చారిత్రక శ్రీరామ మందిర ప్రారంభోత్సవం 22 జనవరి, 2024న జరగనుంది.

Update: 2023-12-25 11:40 GMT

దిశ, సినిమా: రామ జన్మ భూమిలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చారిత్రక శ్రీరామ మందిర ప్రారంభోత్సవం 22 జనవరి, 2024న జరగనుంది. ఈ గ్రాండ్ ఈవెంట్‌కు పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ అతిథుల జాబితాలో సన్నీ డియోల్, అజయ్ దేవ్‌గన్, రణ్‌బీర్ కపూర్, అలియా భట్, ప్రభాస్, ఆయుష్మాన్ ఖురానా, టైగర్ ష్రాఫ్, యష్ వంటి అనేక మంది ప్రముఖుల పేర్లు ఉన్నాయి. వీరితో పాటు, అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, అనుపమ్ ఖేర్, అక్షయ్ కుమార్‌, రాజ్‌ కుమార్ హిరానీ, సంజయ్ లీలా భన్సాలీ, రోహిత్ శెట్టి, మహా వీర్ జైన్ ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలుస్తుంది. ఇక సౌత్‌ నుంచి లెజెండరీ రజనీకాంత్, చిరంజీవి, మోహన్‌ లాల్, ధనుష్ , రిషబ్ శెట్టితోపాటు మరి కొంత మంది ప్రముఖులు ఆహ్వానం అందుకున్నారు.

కాగా శ్రీ రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు కొన్ని యాగాలు నిర్వాహించనుండగా.. జనవరి 16న ప్రారంభమవుతాయి. ఇందుకోసం దేశంలోని నలుమూలల నుంచి దాదాపు 7000 మంది అతిథులు, 4000 మంది సాధువులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి సన్నద్ధమవుతున్న అయోధ్య రామ మందిర కమిటీ అన్ని సక్రమంగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టింది. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించే భక్తులను 320 అడుగుల దూరం నుంచి భగవాన్ రామ్ లల్లా దర్శనానికి అనుమతిస్తామని కూడా వెల్లడించారు అధికారులు.

Tags:    

Similar News