టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. నటుడు చంద్రమోహన్ కన్నుమూత

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు చంద్రమోహన్ కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

Update: 2023-11-11 04:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు చంద్రమోహన్ (82) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 1966 లో వచ్చిన రంగులరాట్నం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. 1943 మే 23న కృష్ణాజిల్లా పమిడి ముక్కలలో జన్మించిన చంద్రమోహన్ దేశ వ్యాప్తంగా 932 చిత్రాల్లో నటించారు. ఆయన నటనకు గాను రెండు ఫిలిం ఫేర్‌ అవార్డులు, ఆరు నంది అవార్డులు అందుకున్నారు. చంద్రమోహన్ మృతి పట్ల పలువురు సంతాపం తెలియజేస్తున్నారు. కాగా, తెలుగులో ప్రాణం ఖరీదు, మన్మదుడు, డార్లింగ్, వర్షం, అతనొక్కడే, చెప్పాలని ఉంది, శంభో శివ శంబో, తూనీగ తూనీగ, నిన్నే పెళ్లాడుతా వంటి అనేక చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Tags:    

Similar News