Pawan Kalyan: పవన్ బర్త్‌డే స్పెషల్.. 'హరి హర వీరమల్లు' నుంచి అదిరిపోయే అప్‌డేట్..
దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. జాగర్లమూడి రాధాకృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కబోతున్న సినిమా 'హరి హర వీరమల్లు'.
దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. జాగర్లమూడి రాధాకృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కబోతున్న సినిమా 'హరి హర వీరమల్లు'. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్‌కు ప్రేక్షకుల నుంచి వీరలెవల్ రెస్పాన్స్ వచ్చింది. అయితే రేపు పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా అభిమానులకు ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్‌డేట్‌ను ఇచ్చింది చిత్ర బృందం.
''స్వాగతిస్తుంది సమరపథం.. దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం'' అనే క్యాప్షన్ ఇస్తూ పవన్ కళ్యాణ్ న్యూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అంతే కాకుండా హరి హర వీర మల్లు నుంచి అదిరిపోయో పవర్ ప్యాక్ గ్లింప్స్‌ను రేపు సాయంత్రం 5:45 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లుగా డైరెక్టర్ జాగర్లమూడి స్వయంగా తన ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.
Also Read :పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు బండ్ల గణేశ్ బర్త్ డే గిఫ్ట్