అదిరిపోయిన మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సాంగ్ ప్రోమో

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’.

Update: 2023-11-05 08:01 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్‌లో శ్రీలీల, మీనాక్షి చౌదరీలు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇక చాలా రోజులుగా మహేష్ ఫ్యాన్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ అయితే ఇప్పుడు రిలీజ్‌కు సిద్ధమైంది. ఇందులో భాగంగా తాజాగా ఈ సాంగ్‌కు సంబంధించిన సాలిడ్ ప్రోమో కట్‌ అయితే రిలీజ్ చేశారు మేకర్స్. ‘మరి దం మసాలా..’ అంటూ సాగే పాటలో విజువల్స్ మహేష్ మాస్ స్వాగ్ మాత్రం కంప్లీట్‌గా అదిరిపోయింది. ఇక ఎప్పటి నుంచో మహేష్‌ను పక్కా కమర్షియల్ మాస్ యాంగిల్‌లో చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక ఈ సాంగ్ ప్రోమో చూస్తుంటే ఈ మూవీతో అది నిజమయ్యేలా కనిపిస్తుంది. మొత్తంగా త్రివిక్రమ్ మహేష్ నెక్ట్స్ లెవెల్లో చూపించేస్తున్నారనిపిస్తుంది. 

Tags:    

Similar News