ఆ స్టార్ హీరోకు తెలియకుండానే నిద్ర మాత్రలిచ్చిన భార్య.. ఇన్నాళ్లకు బయటపడ్డ అసలు నిజం... విడాకులు...
స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య అమృతా సింగ్ కు విడాకులిచ్చి కరీనా కపూర్ ను రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యతో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన ఆయన..సెకండ్ వైఫ్ తో కూడా ఇద్దరిని కన్నాడు.
దిశ, సినిమా: స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య అమృతా సింగ్ కు విడాకులిచ్చి కరీనా కపూర్ ను రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యతో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన ఆయన..సెకండ్ వైఫ్ తో కూడా ఇద్దరిని కన్నాడు. ఇదిలా ఉంటే బాలీవుడ్ హిట్ ఫిల్మ్ ' హమ్ సాత్ సాత్ హై ' సినిమాలో చిన్నకొడుకు పాత్ర పోషించాడు సైఫ్. సల్మాన్ ఖాన్, టబు, కరిష్మా కపూర్, సొనాలీ బింద్రే కీలక పాత్రల్లో నటించారు. అయితే మూవీలో బాగా నటించాలనే ఉద్దేశంతో నిద్ర కూడా పోని సైఫ్.. అటు షూటింగ్ లోనూ సరిగ్గా యాక్ట్ చేయలేదట.
నెంబర్ ఆఫ్ టేక్స్ తీసుకునేవాడట. దీంతో ఈ విషయాన్ని ఫిల్మ్ మేకర్ సూరజ్ బర్జాత్యా.. సైఫ్ అప్పటి భార్య అమృత దగ్గర ప్రస్తావించాడట.
ఆయన రాత్రి నిద్రపోక పోవడం వల్లే ఇలా జరుగుతుందని ఆమె సందేహం వ్యక్తం చేసిందట. దీంతో సైఫ్ కు తెలియకుండా నిద్ర మాత్రలు ఇవ్వమని సూచించాడట సూరజ్. ఆమె అది ఫాలో అయిపోవడంతో హ్యాపీగా నిద్రపోయిన సైఫ్.. తర్వాత రోజు ఒకే షాట్ లో సాంగ్ పూర్తి చేయడంతో మూవీ యూనిట్ షాక్ అయిందట. మొత్తానికి అలా అమృత.. సైఫ్ కు తెలియకుండా స్లీపింగ్ పిల్స్ ఇవ్వడం అతనికి ప్లస్ అయిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు సూరజ్. కాగా సైఫ్, అమృతతో 13ఏళ్లు కాపురం చేశాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చింది.