ప్రతి సినిమా నాకు ఓ గుణపాఠం నేర్పింది.. Rajamouli ఎమోషనల్ పోస్ట్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.

Update: 2023-07-28 03:57 GMT

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. అంతేకాకుండా మన తెలుగు సినిమాలకు మంచి స్థానాన్ని కల్పించాడు. నిత్యం హిట్ సినిమాలు అందిస్తూ బాక్సాఫీసును బద్దలు కొడుతుంటాడు.

తాజాగా, దర్శకధీరుడు తన ట్విట్టర్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. ‘‘ ఎన్ని శుక్రవారాలు.. ఫస్ట్ డే ఫస్ట్ షోలు.. ఉదయాన్నే 8.45కి సీట్లో కూర్చోవడానికి పరుగెత్తుకుంటూ.. అప్పుడే 20 ఏళ్లు గడిచాయి. ప్రతి సినిమా వినోదాత్మకంగా ఉన్నా, నిరాశ పరిచినా నాకు ఏదో గుణపాఠం చెబుతోంది. ప్రియమైన ప్రసాద్ ఐమాక్స్ మీరు సినిమా మాత్రమే కాదు. మీరు నా తరగతి గది ధన్యవాదాలు’’ అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు.

Also Read: ఎద అందాలను పెంచుకోవడానికి Tamannaah ఏం చేస్తుందో తెలుసా?

Tags:    

Similar News