Kollywood: ఆ వయస్సులో కూడా పెళ్లికి రెడీ అవుతున్న హీరో

ఆ వయస్సులో కూడా పెళ్లికి రెడీ అవుతున్న హీరో

Update: 2024-08-19 06:21 GMT

దిశ, సినిమా : జీన్స్ మూవీ హీరో ప్రశాంత్‌ మనందరికీ సుపరిచితమే. ఇతనికి తమిళలలో ఫ్యాన్స్ ఎలా ఉన్నారో తెలుగులో కూడా డే విధంగా ఉన్నారు. ప్రముఖ నటుడు త్యాగరాజన్ కుమారుడైన ప్రశాంత్ ప్రేమ శిఖరం మూవీతో సినిమాల్లోకి అడుగు పెట్టాడు. మొదటి మూవీతోనే హిట్ కొట్టి ఫేమ్ తో పాటు క్రేజ్ కూడా తెచ్చుకున్నాడు.

శంకర్ డైరెక్షన్లో వచ్చిన జీన్స్ మూవీ ఈ హీరోకి బాగా కలిసి వచ్చింది. ఆ తర్వాత వరుస ఆఫర్లు వచ్చినా చేయకుండా ఆచి తూచి సినిమాలు చేయడంతో వెనుకబడ్డాడు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ప్రశాంత్ సొంత బ్యానర్లోనే సినిమాలు చేయడానికి ఇష్ట పడతాడు. రామ్ చరణ్ కోసమే టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి వినయ విధేయ రామలో నటించాడు. దీని గురించి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు.

అంధగన్ మూవీ హిట్ అవ్వడంతో ఈ క్రమంలో నిర్వహించిన సక్సెస్ మీట్ లో ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. త్వరలోనే నా కుమారుడు మళ్లీ పెళ్ళి చేసుకోబోతున్నాడంటూ చెప్పాడు.. తొందర్లోనే మీ అందరికీ గుడ్ న్యూస్ చెబుతానని ఆయన మాటల్లో తెలిపాడు. ప్రస్తుతం, ఇతని వయసు 51 ఏళ్లు. ఈ వయస్సులో కూడా పెళ్లి గురించి ఆలోచిస్తున్నాడంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Full View

Tags:    

Similar News