బాబాలంతా దొంగ నా కొడుకులే.. నటి షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ ఈషా గుప్తా దేవుడు, నమ్మకం, దొంగ బాబాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ ఈషా గుప్తా దేవుడు, నమ్మకం, దొంగ బాబాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె నటించిన 'ఆశ్రమ్ 3' సిరీస్ ప్రమోషన్‌లో భాగంగా.. గాడ్‌మెన్‌గా కనిపించిన బాబీ డియోల్ పాత్రను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. నిజ జీవితంలో ఎంతోమంది గాడ్‌మెన్‌లను కలుసుకున్నాన్న ఆమె.. అలాంటి వాళ్లను తానెప్పుడూ బలంగా నమ్మలేదని చెప్పింది. ఈ మేరకు 'దేవుడిని నమ్ముతాను కానీ గాడ్‌మెన్‌ను కాదు' అని స్పష్టం చేసిన ఈషా.. 'నేను దేవుడితోపాటు మతం పట్ల విశ్వాసమున్న వ్యక్తులను నమ్ముతా. కానీ తమను తాము దేవుడిగా చెప్పుకునే వాళ్లంటే అస్సలు నచ్చదు. ఓ సారి రెండో దేవుడిగా చెప్పుకునేవాళ్లు కలిశాను. మాకు కొంత డబ్బు ఇవ్వండి మీ తరపున మేము పూజ చేస్తామన్నారు. కానీ, ఆ పూజకు మీరు హాజరు కానవసరం లేదన్నారు. అంటే మన పూజలో మనమే భాగం కాలేకపోవడమేమిటి? దేవుడేమైన మీ సొంతమా?' అని ప్రశ్నించుకున్నట్లు తెలిపింది. ఇక నిజమైన సేవను విశ్వసించే వ్యక్తులు ఒక్క పైసా కూడా వసూలు చేయకుండా మనకోసం ప్రార్థిస్తారన్న నటి.. ఈ రకమైన మోసపూరిత వ్యక్తుల గురించి తెలుసుకునేందుకు ఆశ్రమ్ చూడాలని కోరింది.