అమ్మ ఒప్పుకుంటేనే ఆ సీన్ చేస్తానని చెప్పాను: ఈషా డియోల్

‘ధూమ్‌’ సినిమాలో బికినీ ధరించడానికి తల్లి హేమమాలిని అనుమతి తీసుకున్నట్లు ఈషా డియోల్ వెల్లడించింది.

Update: 2023-05-05 08:50 GMT

దిశ, సినిమా : ‘ధూమ్‌’ సినిమాలో బికినీ ధరించడానికి తల్లి హేమమాలిని అనుమతి తీసుకున్నట్లు ఈషా డియోల్ వెల్లడించింది. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. ఈ యాక్షన్ ఫిల్మ్‌లోని టైటిల్ ట్రాక్‌లో బికినీ సన్నివేశంలో నటించడానికి ముందు చాలా ఆందోళన చెందినట్లు తెలిపింది. ‘నేను చాలా భయపడ్డాను. ఆదిత్య చోప్రా డిమాండ్‌కు కమిట్ అయ్యే ముందు అమ్మ అనుమతి కోసం ఒక రోజు సమయం కావాలని కోరాను. అయితే దీని గురించి ఆమెతో మాట్లాడేందుకు కష్టంగా ఫీల్ అయ్యాను. కానీ, నేను ఊహించిన దానికి భిన్నంగా అమ్మ రిప్లై ఇచ్చింది. ‘స్వీమ్ చేసేటపుడు ధరించే దుస్తులే కదా.. అందులో ఏముంది. స్విమ్ షూట్ వేసుకున్నాననే ఫీలింగ్‌తోనే చక్కగా కెమెరా ముందు లీనమైపో’ అని చెప్పింది. అయినప్పటికీ నేను మానసికంగా సిద్ధం కావడానికి ఆరు నెలల టైమ్ పట్టింది’ అంటూ ఈషా చెప్పుకొచ్చింది.

Also Read: శానిటరీ ప్యాడ్స్ ప్రకటనలో స్మృతి ఇరానీ.. భయంగానే నటించిందట! 



Similar News