Allu Shirish: అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది.. ‘బడ్డీ’ ప్రమోషన్స్‌లో అల్లు శిరీష్
అల్లు శిరీష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘బడ్డీ’.
దిశ, సినిమా: అల్లు శిరీష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘బడ్డీ’. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటించారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మించారు. అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ‘బడ్డీ’ ఆగస్టు 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే రిలీజ్ సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం. ఈ మేరకు తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లు శిరీష్ చిత్ర విశేషాలను పంచుకున్నాడు.
‘‘బడ్డీ’ మూవీని లాస్ట్ ఇయర్ మార్చిలో మొదలుపెట్టి జూలైలో సినిమా కంప్లీట్ చేశాం. డిసెంబర్‌లోనే రిలీజ్‌కు తీసుకురావాలని అనుకున్నాం. నా మూవీస్‌కు గ్యాప్ వస్తోంది. ఫాస్ట్‌గా చేసి డిసెంబర్ 31 సక్సెస్ పార్టీ చేసుకోవాలని నేనూ నిర్మాత జ్ఞానవేల్ అనుకున్నాం. అయితే ఈ సినిమాలో 3 వేలకు పైగా సీజీ షాట్స్ ఉన్నాయి. బడ్డీ ఫేస్‌ను యానిమేట్ చేయాలి. వాటిని పర్పెక్ట్‌గా చేయాలంటే డబ్బుతో పాటు ఆర్టిస్టులకు టైమ్ ఇవ్వాలి. దాంతో లేట్ అయ్యింది. ఇందులో నాలుగు మేజర్ యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయి. వాటిని చాలా న్యాచురల్ గా ఉండేలా డిజైన్ చేయ్యాలని అందరం ఒకేలా ఆలోచించాం. దీంతో మేము చాలా సర్ ప్రైజ్ అయ్యాం. మేము అందరం ఒకేలా ఆలోచిస్తున్నాం అనిపించింది. క్లాస్, మాస్ అని తేడా లేకుండా ఈ సినిమా అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.