ఏంగేజ్‌మెంట్ చేసుకున్న రామ్ చరణ్ సోదరి..!!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి సుపరిచితమే.

Update: 2024-01-31 11:58 GMT

దిశ, సినిమా: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి సుపరిచితమే. ప్రస్తుతం ఈ హీరో ‘గేమ్ చేంజర్’ చిత్రంలో నటిస్తున్నారు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన స్టార్టింగ్‌లో అంతగా కలసి రాకున్న తర్వాత.. మగధీర, చిరుత, ధృవ వంటి చిత్రాల్లో అద్భుతంగా నటించి.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. టాలీవుడ్ స్టార్ దర్శకుడు తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ మూవీలో రామ్ చరణ్ నటనకు ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారు.

ఫ్యామిలీ విషయానికొస్తే.. మెగాస్టార్ చిరంజీవి తనయుడైన చరణ్ అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి పెళ్లైన 11 ఏళ్లకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. మెగా ప్రిన్సెస్ రాకతో మెగా ఫ్యామిలీలో సంతోషం నిండింది. రీసెంట్‌గా క్లీంకార పేరు మీద ఓ సాంగ్ కూడా చేశారు. ఇదంతా పక్కన పెడితే..

రామ్ చరణ్‌కు పెళ్లి కానీ ఓ అక్క ఉందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. పెళ్లి కానీ అక్క ఎవరబ్బా.. అని ఆశ్చర్యపోతున్నారా? అదే చరణ్ హీరోగా నటించిన ‘బ్రూస్ లీ’ చిత్రంలో రామ్ చరణ్ కు అక్కగా నటించిన కృతికర్బంధ. ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్టింగ్ లో ఒంగోలు గిత్త, పవన్ కళ్యాణ్ ‘తీన్మార్, భోణి, బ్రూస్ లీ వంటి చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఈ సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. కానీ ఏమైందో తెలియదు కానీ ఈ అమ్మడు ప్రస్తుతం అవకాశాలు కనుమరుగైపోయాయి.

గత ఏడాది నుంచి కృతికర్బంధ పులకిత్ సామ్రాట్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వీరు ఇరు కుంటుంబీకుల సమక్షంలో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ అమ్మడు ప్రియుడు సామ్రాట్ అండ్ ఫ్యామిలీతో కలిసి దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో ‘కాంగ్రాట్స్ చరణ్ సిస్టర్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.




Similar News