Kangana Ranaut : 9 ఏళ్లలో 99 శాతం సినిమాలు ఫ్లాప్.. 'ఎమర్జెన్సీ' పైనే ఆశలన్నీ..
కంగనా రనౌత్ మరోసారి వెండితెరపైకి వచ్చేందుకు సిద్ధమైంది. ఆమె నటించిన 'ఎమర్జెన్సీ' సెప్టెంబర్ 6న థియేటర్లలో విడుదల కానుంది.
దిశ, వెబ్‌డెస్క్ : కంగనా రనౌత్ మరోసారి వెండితెరపైకి వచ్చేందుకు సిద్ధమైంది. ఆమె నటించిన 'ఎమర్జెన్సీ' సెప్టెంబర్ 6న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో ఆమె భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమా ద్వారా ఆమె ఎంత అద్భుతంగా నటిస్తుందో రాబోయే కాలంలో తెలిసిపోతుంది. అయితే ఈ సినిమా ఆమెకు హిట్ అవ్వడం చాలా ముఖ్యం అని ఇప్పటికే ఒక విషయం ఖాయం.
కంగనా 'తను వెడ్స్ మను'లో తనూ పాత్రలో, 'క్రిష్ 3'లో కా పాత్రలో నటించి తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించారు. ప్రస్తుతం కంగనా భారత మాజీ ప్రధాని ఇందిర పాత్రలో తెరపైకి రాబోతోంది. గాంధీ 1975లో భారతదేశంలో విధించిన ఎమర్జెన్సీ పై ఆమె 'ఎమర్జెన్సీ' పేరుతో సినిమాని తీసుకొస్తున్నారు. నటనతో పాటు కంగనా ఈ చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 6న థియేటర్లలో విడుదల చేయనున్నారు.
ఈ సినిమా విడుదలకు ముందే వార్తల్లో నిలిచింది. ఇప్పటికే ఈ చిత్రం పై వివాదం కూడా మొదలైంది. పంజాబ్‌లో ఈ సినిమా విడుదలను నిషేధించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ సినిమాలో సిక్కులను తప్పుగా చూపించారని పంజాబ్-హర్యానా హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. కంగనాకు హత్య బెదిరింపులు కూడా వచ్చాయి.
సినిమాకు సంబంధించి ఎప్పుడు వివాదం వచ్చినా సినిమా పై భారీ ఎఫెక్ట్ నే చూపిస్తుంది. అన్నింటిలో మొదటిది వివాదం కారణంగా చిత్రం ప్రచారం అవుతుంది. వివాదానికి కారణమయ్యే విషయాలు చిత్రంలో ఏమున్నాయో అని తెలుసుకోవడానికి ప్రజలు ఆ చిత్రాన్ని చూడటానికి ఆసక్తి చూపుతారు. దీంతో సినిమా వసూళ్లు ఎక్కడో ఒకచోట పెరుగుతాయని గట్టి నమ్మకం సినిమా యూనిట్ లో కనిపిస్తుంది. రెండవ అంశం ఏమిటంటే వివాదాల కారణంగా చాలా సార్లు సినిమా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. దీంతో సినిమా ఫ్లాప్ స్థాయికి కూడా చేరుకోవచ్చంటున్నారు.
ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అవుతుందా లేక ఫ్లాప్ అయి ఎక్కడో తెలియకుండా పోతుందా ? అనే ప్రశ్నకు సమాధానం సినిమా విడుదలైన తర్వాతే తెలియనుంది. అయితే ఇప్పటికే ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. అది ఏంటంటే ఈ చిత్రం హిట్ కావడం కంగనాకు చాలా ముఖ్యం అని.
ఎందుకు ఇలా అంటున్నామంటే ఈ ప్రశ్నకు సమాధానం కంగనా కెరీర్ లోనే దాగి ఉంది. నిజానికి 2006లో విడుదలైన 'గ్యాంగ్‌స్టర్' చిత్రంతో కంగనా కెరీర్ ప్రారంభించింది. సినిమా జనాలకు నచ్చడంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత కంగనా చాలా చిత్రాల్లో కనిపించింది. వాటిలో కొన్ని విజయవంతమయ్యాయి, మరికొన్ని ఫ్లాప్‌గా మారాయి. కానీ 2015 నుండి ఆమె కెరీర్ చాలా మలుపులు తిరిగింది.
కంగనా చివరి సూపర్‌హిట్ చిత్రం..
2015లో విడుదలైన 'తను వెడ్స్ మను రిటర్న్స్' చిత్రం ఆమె చివరి విజయవంతమైన చిత్రం అని కంగనా కెరీర్‌ని పరిశీలిస్తే అర్థమవుతుంది. ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. ఆ తరువాత ఆమె నటించిన 10 సినిమాలు తెరకెక్కినా వాటిలో 9 ఫ్లాప్ అయ్యాయి. ఇక మిగిలిపోయిన ఒక్క చిత్రం కూడా హిట్ కాదు యావరేజ్. అంటే 'తను వెడ్స్ మను రిటర్న్స్' తర్వాత విడుదలైన 99 శాతం సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
9 ఏళ్లలో విడుదలైన కంగనా చిత్రాల జాబితా..
ఐ లవ్ NY (2015)- ఫ్లాప్
కట్టి బట్టి (2015)- ఫ్లాప్
రంగూన్ (2017)- ఫ్లాప్
సిమ్రాన్ (2017)- ఫ్లాప్
మణికర్ణిక: ది క్వీన్ ఝాన్సీ (2019) - యావరేజ్
జడ్జిమెంటల్ హై క్యా (2019)- ఫ్లాప్
పంగా (2020)- ఫ్లాప్
తలైవి (2021)- ఫ్లాప్
ధాకడ్ (2022)- డిజాస్టర్
తేజస్ (2023)- డిజాస్టర్