లింగ వివక్ష 'లెన్స్'లా అతుక్కుపోయింది: స్టార్ సింగర్ ఎమోషనల్
దిశ, సినిమా: ప్రముఖ బ్రిటిష్ గాయని, రచయిత ఎల్లీ గౌల్డింగ్.. సొసైటీలో నెలకొన్న లింగ వివక్షపై ఎమోషనల్ అయింది.Latest Telugu News
దిశ, సినిమా: ప్రముఖ బ్రిటిష్ గాయని, రచయిత ఎల్లీ గౌల్డింగ్.. సొసైటీలో నెలకొన్న లింగ వివక్షపై ఎమోషనల్ అయింది. సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా సంగీత ప్రపంచంలో కూడా మహిళలకు రక్షణ లేదని, స్వేచ్ఛగా జీవించేందుకు అది సరైన స్థలం కాదని భావిస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు మహిళలు తమను తాము కళాకారులుగా నిరూపించుకుని, గుర్తింపు తెచ్చుకోవడానికి మరింత కష్ట పడాల్సి వస్తుందని చెప్పింది. అలాగే 'మీటూ' ఉద్యమం తర్వాత మహిళల పనితీరుపై వివక్ష తగ్గినట్లు అనిపిస్తున్నా.. దురదృష్టవశాత్తు సమానత్వం ఎక్కడ కనిపించట్లేదని వాపోయింది.
ఇక మ్యూజిక్ వరల్డ్‌లో ఎంతోమంది యువతులు మానసిక ఆనారోగ్యంతో పోరాడుతున్నట్లు గుర్తించానన్న ఆమె.. 'వ్యాపారంగా మారిన ఈ కళాత్మక చక్రం రోజురోజుకు అభివృద్ధి చెందుతున్నప్పటికీ స్త్రీలపై లింగ వివక్ష 'లెన్స్'లా అతుక్కుపోయింది. మగాళ్లతో సమానమైన విజయం సాధించిన చోట కూడా బేధం చూపిస్తున్నారు. పురుషుల పాటలు బాగున్నా, లేకపోయినా.. తమను తాము గొప్ప కళాకారులుగా నిరూపించుకోకపోయినా పురుష ఆధిపత్యం కారణంగా భారీ ఆదరణ లభిస్తోంది' అని అభిప్రాయపడింది.
ఇవి కూడా చదవండి :
నా బాడీ ఎలా చెబితే అలా నడుచుకుంటా: Bhumi Pednekar