కడుపు నిండా తిన్నా అలసటగా ఉంటుందా.. అయితే కారణం ఇదే!

ఏమైనా తినకపోతే నీరసం రావడం అనేది చాలా కామన్. కానీ కొంత మంది కడుపు నిండా తిన్నా కూడా అలసటకు లోను అవుతుంటారు.అయితే దీనికి కారణం విటమిన్ డి లోపమే అంటున్నారు వైద్యులు.

Update: 2023-08-17 04:57 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఏమైనా తినకపోతే నీరసం రావడం అనేది చాలా కామన్. కానీ కొంత మంది కడుపు నిండా తిన్నా కూడా అలసటకు లోను అవుతుంటారు.అయితే దీనికి కారణం విటమిన్ డి లోపమే అంటున్నారు వైద్యులు.

వాస్తవానికి, విటమిన్ డి లేకపోవడం వల్ల, శరీరం యొక్క శక్తి స్థాయి తగ్గడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా మీరు చిన్న పని చేసిన తర్వాత కూడా అలసిపోతారంట. శరీరంలో విటమిన్ డి లోపం కారణంగా, మీరు తరచుగా అనారోగ్యానికి గురవ్వడం, కీళ్లు కండరాల నొప్పులు విపరీతంగా ఉంటాయంట. అలాగే విటమిన్ డి లోపం వలన రోగనిరోధక శక్తి తగ్గి ఇది జలుబు, ఫ్లూ, జ్వరం, దగ్గు లాంటి అనేక రకాల ఇన్ఫెక్షన్‌ల ప్రమాదాన్ని పెంచుతుందంట.

అందువలన ఎంత తిన్నా అలసటగా అనిపిస్తుందంట. అయితే ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు, విటమిన్ డి ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వలన ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అంటున్నారు వైద్యులు.


Similar News