సినిమా షూటింగ్ సమయంలో ఆ పార్ట్‌కి సర్జరీ చేయించుకోమన్నారు.. బాలీవుడ్ నటి వైరల్ కామెంట్స్
బాలీవుడ్ హీరోయిన్ సన్యా మల్హోత్రా, అమీర్ ఖాన్ ‘దంగల్’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది.
దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ సన్యా మల్హోత్రా, అమీర్ ఖాన్ ‘దంగల్’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. అయితే ఇటీవల ‘కథల్’ అనే మూవీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది. ఇటీవల ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. క్రైమ్ థిల్లర్ కథాంశంతో తెరకెక్కి మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. అయితే సన్యా మల్హోత్రా ‘కథల్’ ప్రమోషన్స్‌లో భాంగంగా తన సినీ కెరీర్‌కు సంబంధించిన విషయాలను పంచుకుని ఎమోషనల్ అయ్యింది. సన్య మాట్లాడుతూ.. ‘‘ నాకు ఇప్పటికీ గుర్తు.. దంగల్ సినిమా షూటింగ్ సమయంలో ఒకరు నా రూపురేఖలు బాగాలేవని, అందుకోసం దవడకు సర్జరీ చేయించుకోవాలని సలహా ఇచ్చారు. అప్పుడు నేను ఒక్కటే చెప్పాను.. నా అందం పట్ల సంతోషంగానే ఉన్నాను. ఆ తర్వాత నా దవడను చూసి అవకాశాలు రాలేదు. అలా అని వచ్చిన ఛాన్సులు పోలేదు కూడా! నేను ముంబైకి ఆడిషన్స్ కోసం వచ్చినప్పుడు కూడా ఇదే సమస్య ఎదుర్కొన్నాను. కాన్ఫిడెన్స్‌తో ముందుకు సాగాను’’ అంటూ చెప్పుకొచ్చింది.
Read more: బూబ్స్ షో చేస్తూ రెచ్చిపోయిన బాలీవుడ్ హీరోయిన్.. తట్టుకోలేకపోతున్నామంటున్న నెటిజన్స్
సంప్రదాయ దుస్తుల్లో రెబల్ స్టార్ ప్రభాస్.. పోటీపడ్డ అభిమానులు