దుల్కర్ సల్మాన్ ‘కింగ్ ఆఫ్ కోతా’ ట్రైలర్ రిలీజ్
మలయాళ స్టార్ హీరోల్లో ఒకరైన దుల్కర్ సల్మాన్ ఇప్పటివరకు లవర్‌బాయ్‌గా, ఫ్యామిలీ మ్యాన్ తరహాలో క్లాస్ రోల్స్ చేస్తూ వచ్చాడు. ఇక గత సినిమాలకు భిన్నంగా ‘కింగ్ ఆఫ్ కోతా’ మూవీలో ఫస్ట్ టైమ్ మాస్ రోల్‌లో
దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరోల్లో ఒకరైన దుల్కర్ సల్మాన్ ఇప్పటివరకు లవర్‌బాయ్‌గా, ఫ్యామిలీ మ్యాన్ తరహాలో క్లాస్ రోల్స్ చేస్తూ వచ్చాడు. ఇక గత సినిమాలకు భిన్నంగా ‘కింగ్ ఆఫ్ కోతా’ మూవీలో ఫస్ట్ టైమ్ మాస్ రోల్‌లో కనిపించబోతున్నాడు దుల్కర్. అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించగా చెంబన్ వినోద్, షబీర్, నైలా ఉష, షమ్మీ తిలకన్, శాంతి కృష్ణ, ప్రసన్న, గోకుల్ సురేష్, అనిఖా సురేంద్రన్, శరణ్ శక్తి ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఇక తాజాగా ఈమూవీకి సంబందించిన థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. అనేక యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ పవర్ ఫుల్‌గా ఉండగా ముఖ్యంగా ‘చిన్నప్పుడు రాజుకు ఒక్కటే కల ఉండేది. అతడి తండ్రి లాగానే అతడు కూడా పెద్ద గ్యాంగ్‌స్టర్ అవ్వాలనుకుంటాడు. రాజు ఒకప్పుడు కోతకి మహరాజు’ అనే డైలాగ్ హైలెట్. మొత్తానికి దుల్కర్ సల్మాన్ ఫ్యాన్స్‌కు ఇది పెద్ద ట్రీట్ అని చెప్పాలి.