నిద్రలేని రాత్రులు గడుపుతున్నా.. కన్నీరు పెట్టుకున్న దుల్కర్ వీడియో వైరల్
మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన దుల్కర్ సల్మాన్.. తన నటనతో హీరోగా నిరూపించుకున్నాడు. టాలీవుడ్‌లో మహానటి, సీతారామం వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. తాజాగా దుల్కర్ తన సోషల్ మీడియా
దిశ, సినిమా: మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన దుల్కర్ సల్మాన్.. తన నటనతో హీరోగా నిరూపించుకున్నాడు. టాలీవుడ్‌లో మహానటి, సీతారామం వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. తాజాగా దుల్కర్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేసిన ఒక సెల్ఫీ వీడియో సంచలనం సృష్టించింది. ‘ఒక సంఘటన కారణంగా నేను నిద్రలేని రాత్రులు గడుపుతున్నా. నా జీవితంలో ఇలాంటి సంఘటన తొలిసారి అనుభవిస్తున్నా. పరిస్థితులు మారిపోయాయి. కానీ దాన్ని నా మనసులో నుంచి చెరిపేయలేకపోతున్నా’ అంటూ అసలు విషయం చెప్పకుండా సస్పెన్స్‌లో పెట్టి ఆవేదన వ్యక్తం చేశాడు సల్మాన్. అయితే ఆదివారం రాత్రి దుల్కర్ ఈ వీడియోను పోస్ట్ చేసిన కొద్దిసేపటికే డిలిట్ చేశాడు. దీంతో ఆయన అభిమానుల్లో కలవరం మొదలైంది. అసలేమీ జరిగిందంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
Read More..