'Drishyam 2' తో ఇండస్ట్రీలో కొత్త ఆశలు..
బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ చాలా రోజులుగా సరైన హిట్ కోసం చూస్తుంది. ఇప్పటి వరకు ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలైనప్పటికీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.. Latest Telugu News
దిశ, సినిమా: బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ చాలా రోజులుగా సరైన హిట్ కోసం చూస్తుంది. ఇప్పటి వరకు ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలైనప్పటికీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. స్టార్ హీరోలు సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటం తప్ప లేదు. ఇక అలాంటి టైమ్‌లో అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో నటించిన 'దృష్యం 2' మూవీ థియేటర్ వద్ద సంచలనం సృష్టించింది. మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ 'దృశ్యం' ను హిందీలో రీమేక్ చేసి హిట్ కొట్టిన అజయ్ దేవగణ్.. దానికి సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కాగా మలయాళ వెర్షన్‌తో పోలిస్తే, హిందీ వెర్షన్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేసి.. మరింత ఎగ్జైటింగ్‌గా దర్శకుడు అభిషేక్ పాఠక్ రూపొందించారు. ఇక ఈ సినిమా తొలి రోజు రూ.15 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. కాగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో.. ఈ శనివారం రూ. 25 కోట్ల గ్రాస్ సంపాదించింది. ఇక ఈ వీకెండ్‌లో సుమారు రూ. 60 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయనున్నట్లు అంచనా.