కార్తీక దీపం 2పై క్లారిటీ ఇచ్చిన డాక్టర్ బాబు.. ఎమన్నారంటే?
కార్తీక దీపం సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎక్కువ మంది గుండెల్లో చోటు సంపాదించుకున్న సీరియల్స్‌లో ఇది మొదటి స్థానంలో ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ సీరియల్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
దిశ, వెబ్‌డెస్క్ : కార్తీక దీపం సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎక్కువ మంది గుండెల్లో చోటు సంపాదించుకున్న సీరియల్స్‌లో ఇది మొదటి స్థానంలో ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ సీరియల్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలకు అభిమానులు ఎంతగానో కనెక్ట్ అయ్యారు.
ఇక ఈ సీరియల్ కంప్లీట్ అవ్వడంతో చాలా మంది బాధపడ్డారు. ఇంకొన్ని రోజులు కంటిన్యూ అవుతే బాగుండు అని అనుకున్నవారు లక్షల్లోనే ఉంటారు. అయితే తాజాగా..డాక్టర్ బాబు అలియాస్ నిరూపమ్..ఓ ఇంటర్వ్యూలో కార్తీక దీపం 2పై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.
నేను ఇప్పటికీ ఎక్కడికి వెళ్లినా, కార్తీక దీపం , వంటలక్క గురించే ఎక్కువగా అడుగుతున్నారు. నాపేరు మర్చిపోయి డాక్టర్ బాబు అనే పిలుస్తుంటారు. ఇక భార్య భర్తలు అన్నాక, ప్రతీ ఒక్కరి జీవితంలో ఏవో చిన్న చిన్న గొడవలు ఉంటాయి. అందుకే చాలా మంది కార్తీక దీపం సీరియల్‌కి కనెక్ట్ అయ్యారు.
ఇక కార్తీక దీపం 2 గురించి మాట్లాడుతూ.. కార్తీక దీపం 2 నాకు తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే దానికి తగిన కథ దొరకాలి. అన్నీ కుదిరితే సీజన్ 2 చేయాలి. లేకపోతే టచ్ చేయకపోవడమే బెటర్. కానీ మీ ఇద్దరి కాంబోలో మరో సీరియల్ వచ్చే అవకాశం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read: దేవుడా.. కీర్తి సురేష్‌కు ఇప్పటికీ అది వేసుకోవడం రాదా?
మెగా కోడలు లావణ్య త్రిపాఠికి అరుదైన వ్యాధి.. పోస్ట్‌తో క్లారిటీ