Double Ismart: డబుల్ ఇస్మార్ట్ ట్విట్టర్ రివ్యూ.. హిట్టా..? ఫట్టా..?

స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15) సందర్భంగా రామ్ పోతినేని నటించిన ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది.

Update: 2024-08-15 02:12 GMT

దిశ, సినిమా: స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15) సందర్భంగా రామ్ పోతినేని నటించిన ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆల్రెడీ ప్రీమియర్స్ స్టార్ట్ అయ్యాయి. కాగా అభిమానులంతా సోషల్ మీడియాలో తమ స్పందన తెలియజేస్తున్నారు. కావ్య థాపర్ కథానాయికగా నటించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ 162 నిమిషాల నిడివి ఉన్న హీరో చిన్నతనం సన్నివేశాలతో స్టార్ట్ అవుతుంది. తర్వాత సంజయ్ దత్ బిగ్ బుల్ రూల్‌లో కనిపిస్తాడు. ఇందులో రామ్ స్టైలిష్ లుక్ అదిరిపోయింది కానీ ప్రేక్షకుల అంచనాలకు చేరుకోలేకపోయింది. హీరో ఎనర్జీని హైలెట్ చేస్తూ పూరి జగన్నాధ్ చూపించారు. కామెడీ, టైమింగ్, బీజీఎం కూడా అంతంత మాత్రానే ఉన్నాయని కామెంట్లు పెడుతున్నారు. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే కాస్త బెటర్‌గా ఉందని అంటున్నారు. సెకండ్ హాఫ్ లో దర్శకుడు మార్క్ డైలాగులు, ట్విస్ట్ లు, మదర్ సెంటిమంట్‌లతో బాగానే తెరకెక్కించాడు కానీ ఇస్మార్ట్ శంకర్ జనాల్ని అంతగా ఆకట్టుకోలేదు.

Tags:    

Similar News