double ismart: డబుల్ ఎనర్జీతో ‘డబుల్ ఇస్మార్ట్’ టీమ్.. ఫస్ట్ సక్సెస్ అయిన చోటే ప్రీ రిలీజ్ ఈవెంట్

ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డెడ్లీ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్-వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ 'డబుల్ ఇస్మార్ట్'.

Update: 2024-08-12 13:42 GMT

దిశ, సినిమా: ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డెడ్లీ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్-వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ 'డబుల్ ఇస్మార్ట్'. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉండటంతో.. సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్‌తో నేషనల్ వైడ్‌గా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తున్నారు చిత్ర బృందం. ఈ నేపధ్యంలో తాజాగా వరంగల్‌లో 'డబుల్ ఇస్మార్ట్' ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా నిర్వహించారు.

ఈ సందర్భంగా హీరో రామ్ మాట్లాడుతూ.. ‘హాయ్ వరంగల్.. ఇస్మార్ట్ శంకర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి ఇక్కడికి వచ్చాం, మళ్ళీ డబుల్ ఇస్మార్ట్ ఈవెంట్‌కి ఇక్కడి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా ఇస్మార్ట్ శంకర్‌కి మించి ఉంటుంది. ఛార్మి ఫైటర్.. ఆమె లేకుండా ఈ సినిమా పాజిబుల్ అయ్యేది కాదు. పూరితో ఎనర్జీ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. పూరి గన్ లాంటి వారు. పేల్చే గన్ బావుంటే బుల్లెట్ ఎం తఫోర్స్‌గా అయినా వెళ్తుంది. పూరి లాంటి గన్ అందరి యాక్టర్స్‌కి కావాలి. లవ్ యూ సర్. డబుల్ ఇస్మార్ట్ మెంటల్ మాస్ మ్యాడ్ నెస్ క్యారెక్టర్. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. ఏదైనా మనికి నచ్చిందే చేయాలి. పక్కోడి గురించి పట్టించుకుంటే పనులు జరగవు. ఆగస్ట్ 15న కలుద్దాం. లవ్ యూ ఆల్' అన్నారు.

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ.. ‘హాయ్ ఎవ్రీ వన్. మీరు ఊరు రాకుండా మిమ్మల్ని కలవకుండా మా సినిమాలు రిలీజ్ అవ్వవు. డబుల్ ఇస్మార్ట్ సినిమా ఆగస్టు 15న రిలీజ్ అవుతుంది. డబుల్ ఇస్మార్ట్ గురించిమాట్లాడాలంటే.. ఈ సినిమాలో పని చేసిన యాక్టర్స్‌కి, టెక్నిషియన్స్‌కి థాంక్స్. రామ్ డబుల్ ఎనర్జీతో ఈ సినిమా చేశాడు. ప్రతి సీన్‌ని ఎంజాయ్ చేస్తారు. సినిమా మా అందరికీ బ్లాక్ బస్టర్ కావాలి. ఈ ఈవెంట్‌కి వచ్చిన అందరికీ.. పోలీస్ డిపార్ట్మెంట్‌కి థాంక్స్. ఆగస్ట్ 15 సినిమా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ వెళ్లి చూడండి. రామ్ పోతినేని మిమ్మల్ని ఎంటర్ టైనర్ చేయడానికి రెడీగా ఉన్నారు' అన్నారు.

నిర్మాత ఛార్మి మాట్లాడుతూ.. ‘హాయ్ వరంగల్. ఇస్మార్ట్ శంకర్‌కి ఇక్కడే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశాం. ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్ తీస్తే ఇక్కడే ప్రీరిలీజ్ ఈవెంట్ చేస్తామని చెప్పాం. ఇస్మార్ట్ శంకర్‌ని చాలా పెద్ద హిట్ చేశారు. ఇప్పుడు ‘డబుల్ ఇస్మార్ట్’ ఆగస్ట్ 15న మీ ముందుకు రాబోతోంది. పాటలు పెద్ద హిట్ చేశారు, ట్రైలర్ రెస్పాన్స్ చాలా బావుంది. ఆగస్ట్ 15న హిట్ కొట్టిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. లవ్ యూ ఆల్' అన్నారు.

Read More..

Puri Jagannadh: లైగర్ ఫ్లాప్ అయ్యాక రాజమౌళి ఫాదర్ నాకు కాల్ చేసారు.. చాలా ఎమోషనల్ అయ్యా 

Tags:    

Similar News