గుడికి వచ్చినప్పుడు పర్సనల్ విషయాలు మాట్లాడోద్దు? మంచు లక్ష్మీ ఫైర్
మంచులక్ష్మీ గురించి పరిచయం అక్కర్లేదు. మంచి మంచి చిత్రాలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
దిశ, సినిమా: మంచులక్ష్మీ గురించి పరిచయం అక్కర్లేదు. మంచి మంచి చిత్రాలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అయితే పలు విషయాల కాంట్రవర్సీతో మంచు ఫ్యామిలి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా మంచు లక్ష్మీ శ్రీకాళహస్తి శివుడి ఆలయాన్ని దర్శించుకుంది. ఆ సందర్భంగా అక్కడ లోకల్ మీడియాతో ఆమె మాట్లాడుతున్నపుడు విష్ణు, మనోజ్ రెండో పెళ్లి గురించిన ప్రశ్నలు ఎదురయ్యాయి.
'మనోజ్.. భూమా నాగ మౌనికను పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి? దీనిపై మీ స్పందన ఏంటి అని అడగారు. 'గుడికి వచ్చినప్పుడు ఇలా పర్సనల్ విషయాలు అడగటం కరెక్ట్ కాదు. ఆ విషయాన్ని మీరు మనోజ్‌నే అడగండి' అని బదులిచ్చింది లక్ష్మీ. అలాగే విష్ణుపై వస్తున్న ట్రోలింగ్స్ గురించి అడిగితే 'అది విష్ణుని అడగాల్సిన ప్రశ్న. నా సినిమాల గురించి అడిగితే నేను సమాధానం ఇస్తా' అని సమాధానం చెప్పింది.