నిజాలు తెలియకుండా నిందలు వేయొద్దు.. మాజీ భర్తతో రిలేషన్‌పై పూజా
మాజీ భర్త ఫర్హాన్ ఫర్నిచర్‌వాలా క్యారెక్టర్‌పై పూజా బేడీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
దిశ, సినిమా: మాజీ భర్త ఫర్హాన్ ఫర్నిచర్‌వాలా క్యారెక్టర్‌పై పూజా బేడీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల తమ బంధం గురించి రకరకాల పుకార్లు వినిపిస్తున్నట్లు చెప్పిన నటి.. వాటన్నింటిని తప్పుదోవ పట్టించే హెడ్‌లైన్స్‌గా పేర్కొంది. 1994లో ఇష్టపడి పెళ్లిచేసుకున్న వీరిద్దరూ 2003లో విడిపోగా వీరికి అలయ, ఓమర్ అనే ఇద్దరు పిల్లలున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా.. ‘కొంతమంది మా రిలేషన్ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజానికి మెమెప్పుడూ ఒకరినొకరం దూషించుకోలేదు. నన్ను, నా పిల్లలను అతనెప్పుడూ కించపరచలేదు. మానసికంగానూ ఎలాంటి ఇబ్బందులకు గురిచేయలేదు. పిల్లల ఖర్చులకు సంబంధించి ఆయనే సహకారం అందించాడు. ఇది నిజం. ఎందుకంటే మా జీవితంలో ఏమీ జరిగిందో మాకు మాత్రమే తెలుసు. కాబట్టి నిజాలు తెలియకుండా అనవసరమైన నిందలు వేయడం మానుకోండి’ అని నెటిజన్లకు సూచించింది.
Also Read: కీర్తి సురేష్‌ను తెగపొగిడేసిన సిద్ధార్థ్.. లైన్‌లో పెడుతున్నాడంటున్న నెటిజన్లు