రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమాలు చేస్తున్నా : కిరణ్ అబ్బవరం
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ సరైన హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు.
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ సరైన హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. ‘మీటర్’, ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’, ‘రూల్స్ రంజన్’ వంటి మూవీస్ బ్యాక్ టూ బ్యాక్ ఫెయిల్యూర్స్‌తో కెరీర్‌పై ఎఫెక్ట్ చూపాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కిరణ్.. ఈ పరాజయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.‘ ‘మీటర్’, ‘రూల్స్ రంజన్’తో పాటు ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ సినిమాల కోసం ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదు. లాభాల్లో వాటా పద్ధతిలోనే సినిమాలు చేస్తున్నా.
‘సెబాస్టియన్ పీఎస్ 524’ నుంచే ఇలా ఫాలో అవుతున్నా. ఒకవేళ ప్రొడ్యూసర్లు నష్టపోతే వారిని ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ అడగను. ఇక ‘మీటర్’, ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ రిజల్ట్ ముందే ఊహించాను. ఒకవేళ నేను నిర్మాత అయ్యుంటే ఆ సినిమాలను నిర్మించేవాడిని కాదు. ‘మీటర్’ కథ బాగానే ఉన్నా నా ఇమేజ్‌కు మించిన ఎలివేషన్స్, హీరోయిజం వల్ల మూవీ ఫెయిల్ అయింది. కానీ ఈ ఫలితాల నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నా. ఇప్పుడొక క్లారిటీ వచ్చింది. కథల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిసింది’ అని చెప్పుకొచాడు.