Prabhas : కృష్ణం రాజు మరణం తర్వాత బాధలో ఉన్న తన పెద్దమ్మకు ప్రభాస్ చెప్పిన సీక్రెట్ ఏంటో తెలుసా?
రెబల్ స్టార్ కృష్ణం రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో కష్టాల తర్వాత ఆయన స్టార్ హోదా సంపాదించుకున్నాడు. ఇక ఈయన వారసత్వాన్ని ప్రభాస్ కొనసాగిస్తున్నాడు. ప్రభాస్‌కు కృష్ణం
దిశ, సినిమా : రెబల్ స్టార్ కృష్ణం రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో కష్టాల తర్వాత ఆయన స్టార్ హోదా సంపాదించుకున్నాడు. ఇక ఈయన వారసత్వాన్ని ప్రభాస్ కొనసాగిస్తున్నాడు. ప్రభాస్‌కు కృష్ణం రాజు ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. ఆయనతో ప్రతీ విషయాన్ని పంచుకోవడమే కాకుండా, ప్రభాస్‌కు ఎలాంటి కష్టం వచ్చినా వారు అండగా ఉంటారు అనే ధైర్యం కూడా. ఇక ఆయన మరణంతో వారి కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. ముఖ్యంగా కృష్ణం రాజు భార్య, ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి చాలా బాధపడింది. ముగ్గురు ఆడ పిల్లలు ఒంటరి అయిపోయారంటూ చాలా బాధ పడి మానసికంగా , కుంగిపోయింది. కాగా, ఆ సమయంలో ప్రభాస్ తన పెద్దమ్మకు చెప్పిన ఒకే మాట అందరిచేత శభాష్ అనిపిస్తుంది.
ప్రభాస్‌కు శ్యామలాదేవి అన్నా, తన పిల్లలు అన్నా చాలా ఇష్టం. వారితో ఎక్కువ సమయం గడుపుతారు. అయితే శ్యామలా దేవి బాధను చూసిన మన డార్లింగ్ ఓదార్చే ప్రయత్నం చేస్తూ..పెద్దనాన్న లేరు అని ఎందుకు అనుకుంటున్నావు, మీరు ఒంటరి కాదు. మీకు నేను ఉన్నాను. ఆయన లేరు అనుకోకూడదు, పెద్దనాన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆయన లెగసీ కంటీన్యూ చేస్తే ఆయన మనతో ఉన్నట్టే అంటూ చెప్పాడంట. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రభాస్ ఇటీవల కల్కీ2898 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే.