దర్శక ధీరుడు రాజమౌళిపై డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు..? ఎక్కడ..?

దర్శక ధీరుడు రాజమౌళి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ట్రాక్ రికార్డును క్రియేట్ చేసుకున్నాడు.

Update: 2024-07-06 11:35 GMT

దిశ, సినిమా: దర్శక ధీరుడు రాజమౌళి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ట్రాక్ రికార్డును క్రియేట్ చేసుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ ‘స్టూడెంట్ నం. 1’ చిత్రంతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన.. మొదటి మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. డైరెక్టర్‌గా తనకంటూ స్పెషల్ ఈమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక తర్వాత ఆయన చేసిన సినిమాల్లో మాక్సిమమ్ అన్ని బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సొంతం చేసుకున్నాము. ముఖ్యంగా ‘బాహుబలి 1, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్’తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతే కాకుండా.. ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ సాధించిన తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించింది.

అలాంటి హిస్టరీ సొంతం చేసుకున్న జక్కన్న సినీ చరిత్రపై ఇప్పుడు డాక్యుమెంటరీ రాబోతుంది. ప్రముక ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దర్శకధీరుడు రాజమౌళి సిని జీవితంపై డాక్యుమెంటరీ తీసింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ.. ‘ఒక మనిషి.. అనేక బ్లాక్ బస్టర్లు.. అంతులేని ఆశయం.. ఈ లెజెండరీ ఫిల్మ్ మేకర్ తన శిఖరానికి చేరుకోవడానికి ఎన్ని అడ్డంకులు ఎదురయ్యాయి..? మోడ్రన్ మాస్టర్స్: S.S. రాజమౌళి, ఆగస్ట్ 2న వస్తున్నారు.. Netflixలో మాత్రమే!’ అంటూ పోస్ట్ పెట్టింది. ప్రజెంట్ ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.


Similar News