వ్యూస్ కోసం ఇలా దిగజారి చీప్ రాతలు రాస్తారా : మమతా మోహన్ దాస్
ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగింది.
దిశ, సినిమా: ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగింది. వెబ్‌సైట్స్ కూడా భారీగానే పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా వ్యూస్ కోసం ఆయా వెబ్ సైట్లు దారుణమైన థంబ్ నెయిల్స్ పెడుతున్నాయి. ఎదుటివారి వ్యక్తిగత జీవితం గురించి పట్టింపు లేకుండా వార్తలు రాస్తున్నాయి. ఇలాంటి తప్పుడు న్యూస్‌తో చాలా మంది సెలబ్రిటీలు తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు. తాజాగా రష్మిక మందన్న, కత్రినా కైఫ్ లాంటి స్టార్ హీరోయిన్లు డీప్ ఫేక్ బారినపడ్డారు. అయితే తాజాగా నటి మమతా మోహన్ దాస్‌పై.. గీతు నాయర్ అనే ఓ ఫేక్ అకౌంట్ నుంచి ‘ఇక నేను బతకలేను. చావుకు లొంగిపోతున్నా. నటి మమతా మోహన్ దుర్భర జీవితం’ అనే వార్త పబ్లిష్ చేశారు. ఈ వార్త కాసేపట్లోనే నెట్టింట్లో వైరల్‌గా మారడంతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని చాలా మంది షాక్ అయ్యారు.
ఎందుకంటే మమతా మోహన్ దాస్ ఆల్రెడీ క్యాన్సర్ బారినపడి మెరుగైన చికిత్స ద్వారా ఆ సమస్య నుంచి బయటపడింది. కానీ ఇంతలోనే ఇలాంటి ప్రచారం జరగడంతో అందరూ నిజమని భ్రమపడ్డారు. దీంతో నటి స్పందించక తప్పలేదు. ‘పాపులారిటీ కోసం మరీ ఇలా చీప్ రాతలు రాయకూడదు. వ్యూస్ కోసం ఇతరుల జీవితాల గురించి ఇలా ఫేక్ వార్తలు పబ్లిష్ చేయడం ఏంటి? అసలు నా గురించి మీకు ఏం తెలుసని అలా రాశారు? మీ పేజీని పాపులర్ చేసుకోవడానికి ఎవరి గురించైనా ఏమైనా రాస్తారా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయకండి అంటూ నెటిజన్లకు విజ్ఞప్తి చేసింది.