Anasuya : బంపర్ ఆఫర్.. యాంకర్ అనసూయ సినిమా టికెట్స్ ఫ్రీగా కావాలా?

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె జబర్దస్త్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకుంది. తర్వాత వరుసగా పలు సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. ముఖ్యంగా

Update: 2024-08-06 11:59 GMT

దిశ, సినిమా : యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె జబర్దస్త్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకుంది. తర్వాత వరుసగా పలు సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. ముఖ్యంగా ఈ బ్యూటీ రంగస్థలం, పుష్ప సినిమాలో తన నటనతో అదరగొట్టింది. దీంతో అనసూయకు వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. అంతే కాకుండా ఇటీవల ఈ బ్యూటీ ఐటమ్ సాంగ్స్, గ్లామర్ రూల్స్ కూడా చేసేందుకు రెడీ అని తెలిపిన విషయం తెలిసిందే.

దీంతో ఈ జబర్దస్త్ బ్యూటీకి వరుసగా ఆఫర్స్ క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. అనసూయ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తున్నట్లు తెలుస్తుండగా, ఇప్పుడు సింబా మూవీలో కూడా ఈమె నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా చెట్లు నాటడం, చెట్లు పెంచడం, ప్రకృతిని పరిరక్షించడం అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా, మూవీ టీం ఈ సినిమాకు సంబంధించిన బంపర్ ఆఫర్ ప్రకటించారు. చెట్లు నాటి తమకు ఫోటోలు పంపిస్తే సింబా చిత్రానికి ఫ్రీ టికెట్స్ ఇస్తామని తెలిపింది. దీంతో ప్రతి ఒక్కరు ఫ్రీగా సినిమా చూసే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చిత్ర బృందం తెలిపుతోంది.

Tags:    

Similar News