ఏ.ఆర్. దిలీప్ కుమార్.. రెహమాన్‌గా ఎందుకు మారాడో తెలుసా?

భారతీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసిన స్వర మాంత్రికుడు ఏ.ఆర్. రెహమాన్.

Update: 2023-01-17 10:28 GMT

దిశ, సినిమా: భారతీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసిన స్వర మాంత్రికుడు ఏ.ఆర్. రెహమాన్. ట్రెడిషనల్ క్లాసిక్స్ నుంచి పాప్ వరకూ అన్ని రకాల మ్యూజిక్స్‌ను మిక్స్ చేసిన లెజెండ్. ఇప్పటివరకూ అతను కంపోజ్ చేసిన ప్రతి పాట ప్రత్యేకమే. మనసును తాకే మధురమైన సంగీతాన్నే కాదు హుషారెత్తించే ఫాస్ట్ బీట్స్ కూడా కంపోజ్ చేసి చిందులేయించాడు. మ్యూజిక్ అంటే రెహమాన్ అనేలా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అయితే ఇప్పుడు ఆయన గురించి ఎవరికీ తెలియని నిజాలు మనం తెలుసుకుందాం. రెహమాన్ అసలు పేరు ఏ.ఆర్. దిలీప్ కుమార్.. అతను హిందూ కుటుంబంలో జన్మించారు. కాగా ఇస్లాం మతాన్ని స్వీకరించిన ఆయన పేరును రెహ్మాన్‌గా మార్చుకున్నాడు. ఎందుకంటే దిలీప్ కుమార్ అనే పేరు అతనికి నచ్చలేదని ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చాడు. ఒక హిందూ జ్యోతిష్యుని సలహా ప్రకారం తన పేరును, ఏ.ఆర్. రెహమాన్‌గా మార్చుకున్నాడట.

ఇవి కూడా చదవండి : ఆ కారణంతోనే వీడియోలకు గ్యాప్ ఇచ్చిన హర్ష సాయి

Tags:    

Similar News