దేవర సినిమాలో జాన్వీ కట్టుకున్న చీర ఎవరిదో తెలుసా?

అందాల క్వీన్ జాన్వీ కపూర్‌కు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ అమ్మడు తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే

Update: 2024-03-08 08:38 GMT

దిశ, సినిమా : అందాల క్వీన్ జాన్వీ కపూర్‌కు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ అమ్మడు తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా తన పుట్టిన రోజు సందర్భంగా తాను తెలుగులో నటించే మరో సినిమా గురించి కూడా అఫీషియల్‌గా చెప్పుకొచ్చింది. బుచ్చిబాబు సనా రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా సెలెక్ట్ చేసినట్లు మూవీ టీం తెలిపారు.

ఇక మార్చి7న జాన్వీ తన బర్త్ డే‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా దేవర టీం జాన్వీ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. పట్టు చీరలో, హెయిర్ లీవ్ చేసి , కొంటె చూపు, చిన్న నవ్వుతో ఈ ముద్దుగుమ్మ చాలా అందంగా ఉంది.అచ్చం తెలుగు అమ్మాయిలా ఈ అమ్మడు కనిపించారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో జాన్వీ కట్టుకున్న చీర గురించి తెగ ముచ్చటిస్తున్నారు. చాలా ఓల్డ్ మోడల్ అయిన సారీ జాన్వీకి చాలా సెట్ అయ్యింది. ఈ చీర జాన్వీ అమ్మ శ్రీదేవిదే కావచ్చు అంటూ ఓ వార్త సోష‌ల్ మీడియాను షేక్ చేస్తుంది.కాగా, దేవరలో జాన్వీ ఓ సాంగ్‌లో ఈ సారీలోనే కనిపించనుందని టాక్.


Similar News