Veenamalik :అత్యధిక కిస్‌లు అందుకోవడమే కాకుండా 26 ఏళ్లు జైలు శిక్ష అందుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

బాలీవుడ్ నటి వీణా మాలిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె నటన, అందంతో బాలీవుడ్‌లో మంచి ఫేమ్ సంపాదించుకుంది. అంతే కాకుండా అప్పట్లో ఎక్కువ రచ్చ కూడా చేసి వార్తల్లో నిలిచింది

Update: 2024-08-02 16:02 GMT

దిశ, సినిమా : బాలీవుడ్ నటి వీణా మాలిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె నటన, అందంతో బాలీవుడ్‌లో మంచి ఫేమ్ సంపాదించుకుంది. అంతే కాకుండా అప్పట్లో ఎక్కువ రచ్చ కూడా చేసి వార్తల్లో నిలిచింది. కాగా, తాజాగా ఈ నటికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

పాకిస్థాన్ నటి అయినా వీణా మాలిక్ అత్యధిక కిస్‌లు అందుకొని గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేసింది. 2013లో నిమిషంలోనే 137 కిస్‌లు అందుకొని రికార్డ్ క్రియేట్ చేసింది. అలా ఫేమ్ సంపాదించిన ఈ బ్యూటీ ఓ న్యూడ్ ఫోటోతో తెగ రచ్చ చేసింది. 2011లో ఎఫ్‌హెచ్ఎం ఇండియా అనే తన కవర్ పేజీపై వీణ న్యూడ్ ఫోటో వేసింది. దీంతో అప్పట్లో ఈ వార్త దుమారం రేపింది. ఇదే అనుకుంటే, ఈ నటి 2013లో వ్యాపార వేత్త అయిఅసద్ బషీర్ ఖాన్‌ను పెళ్లి చేసుకొని విడాకులు తీసుకుంది. అయితే వీరి పెళ్లి వీడియోను జియో టీవీలో ప్లే చేయడంతో ఇది దైవ దూషణం కిందకు వస్తుందని గిల్గిట్ కోర్టు ఈ జంకు 26 ఏళ్లు జైలు శిక్ష విధించి. కానీ ఆ శిక్ష ఇప్పటి వరకు కూడా అమలు కాలేదు. కాగా, తాజాగా ఈ నటికి సంబంధించిన ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News