మధ్యలోనే ఆగిపోయిన ఉదయ్ కిరణ్ సినిమాలు ఏవో తెలుసా?
ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరో హోదా సంపాదించుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అందరికీ ముందుగా గుర్తు వచ్చే పేరు ఉదయ్ కిరణ్.
దిశ, వెబ్‌డెస్క్ : ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరో హోదా సంపాదించుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అందరికీ ముందుగా గుర్తు వచ్చే పేరు ఉదయ్ కిరణ్. ఆయన నటించిన మొదటి మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో ఒక్కసారిగా ఉదయ్ స్టార్ హీరో రేంజ్‌కు ఎదిగిపోయాడు. ఇక ఈ యంగ్ హీరో నటనకు చాలా మంది ఫిదా అయిపోయారు.
ఇక మనసంతా నువ్వే సినిమా తర్వాత ఉదయ్ కిరణ్‌కు సమస్యలే తలెత్తాయని చెప్పవచ్చు.కలుసుకోవాలని, శ్రీరామ్ వంటి సినిమాలు కమర్షియల్ బాగానే వసూలు చేసినా, ఆ తర్వాత నుంచి సీన్ పూర్తిగా రివర్స్ అయింది. నీ స్నేహం, నీకు నేను నాకు నవ్వు, ఔనన్నా కాదన్నా సినిమాలు తప్ప అన్నీ ప్లాప్ అయ్యాయి. ఇతను సంపాదించుకున్న ఫాలోయింగ్ కూడా పూర్తిగా దూరమైపోయింది. దీంతో ఉదయ్ కిరణ్ మానసికంగా చాలా కుంగిపోయాడు. ఫ్యామిలీ ఇష్యూస్, సినిమాల పరంగా ఆయన చాలా మానసిక క్షోభను అనుభవించడంట. తర్వాత ఎవరూ ఊహించని విధంగా ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆయన ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చిందో ఎవ్వరికీ తెలియదు.
ఇక అప్పట్లో ఉదయ్ కిరణ్ చేయాల్సిన దాదాపు 10 సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయంట. అవిగనుక పట్టాలెక్కుతే, ఉదయ్ కిరణ్ చనిపోయేంత పరిస్థితి వచ్చేది కాదంటున్నారు కొందరు.
ఉదయ్ కిరణ్‌వి ఏసినిమాలు ఆగిపోయాయో ఇప్పుడు చూద్దాం.
స్టార్ నిర్మాత ఏ.ఎం. రత్నం సూర్య మూవీస్ బ్యానర్ పై ఉదయ్ కిరణ్‌తో ప్రేమంటే సులువు కాదురా అనే ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. దాదాపు 40 శాతం షూటింగ్ కూడా పూర్తయింది. కానీ ఎందుకో ఏమో ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.
ప్రత్యూష క్రియేషన్ బ్యానర్ పై ఉదయ్ కిరణ్-అంకితలతో ఓ ప్రాజెక్ట్ కూడా ప్రారంభించారు. తరువాత ఈ ప్రాజెక్ట్ రద్దయింది.
అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఉదయ్‌కిరణ్-ఆశిన్ జంటగా ఓ చిత్రం ప్లాన్ చేశారు. ఇది కూడా ఆగిపోయింది.
బాలకృష్ణ-సౌందర్య ప్రధాన పాత్రలో నర్తనశాల అనే సినిమాను ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో ఉదయ్ కిరణ్‌ను అభిమాన్యుడి పాత్రకు ఎంపిక చేసుకున్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనేలేదు. ఉదయ్‌తో పాటు సౌందర్య కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లారు.
త్రిష-ఉదయ్‌కిరణ్ కాంబోలో జబ్‌వీమెట్ తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు.
సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారు లవర్స్ సినిమాను ఉదయ్‌కిరణ్, సదాతో రూపొందించాలని ప్లాన్ చేశారు. ఆ ప్రాజెక్ట్ కూడా రద్దయినది. ఇలా చాలా సినిమాలు ఉదయ్ కిరణ్‌వి మధ్యలోనే ఆగిపోయాయంట.