Ram CharanTej : రామ్ చరణ్ కూతురికి చిరంజీవి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?

మెగా ఫ్యామిలీలోకి క్లింకార రావడంతో ఆ ఇళ్లు మొత్తం సంతోషంతో నిండిపోయింది. అంతే కాకుండా మెగా ప్రిన్సెస్‌తో వారికి చాలా కలిసి వచ్చిందంట. ఇక పెళ్లైన పది సంవత్సరాల తర్వాత రామ్ చరణ్ దంపతులకు కూతురు పుట్టడంతో

Update: 2023-08-09 05:51 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మెగా ఫ్యామిలీలోకి క్లింకార రావడంతో ఆ ఇళ్లు మొత్తం సంతోషంతో నిండిపోయింది. అంతే కాకుండా మెగా ప్రిన్సెస్‌తో వారికి చాలా కలిసి వచ్చిందంట. ఇక పెళ్లైన పది సంవత్సరాల తర్వాత రామ్ చరణ్ దంపతులకు కూతురు పుట్టడంతో ఎంతో మంది సినీ ప్రముఖులు పాపను చూడటానికి వచ్చి రక రకాల బహుమతులు ఇచ్చి వెళ్తున్నారు.

అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన బహుమతి గురించి నెట్టింట్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. చిరు దంపతులు తన మనవరాలికి వారికి ఎంతో ఇష్టమైన హనుమాన్ రూపంలో ఉన్న ఒక గోల్డ్ డాలర్‌ని ఇచ్చినట్లు సమాచారం. అలాగే ఉపాసన పుట్టింటి వాళ్ళు బంగారు ఊయల ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Read More:   ఈ ఒక్క తప్పు చేయకుండా ఉంటే.. నాగ చైతన్య జాతకమే మారిపోయేది?

Tags:    

Similar News