కుప్పకూలిన యజమాని కోసం కుక్క చేసిన పనికి నెటిజన్లు ఫిదా! (వీడియో)
కుక్కలకు ఉన్న విశ్వాసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
దిశ, ఫీచర్స్: కుక్కలకు ఉన్న విశ్వాసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొందరు మనుషులను కుక్కలతో పోల్చి ‘నీ కంటే కుక్కలు నయం కదా’ అంటూ వాటినే గొప్పగా చేసి మాట్లాడుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. పెంచుకుంటున్న యజమాని కోసం కుక్కలు ఏం చేయడానికైనా సిద్ధపడుతుంటాయి. ముఖ్యంగా ఇంట్లో వచ్చేది దొంగలా?, చుట్టాలా?, సొంత మనుషులా?, పోలీసులా? అనేది కూడా చూడకుండా రక్షణ కల్పిస్తాయి. యజమానికి ఏదైనా కష్టం వస్తే కూడా అవి రియాక్ట్ అయ్యే పద్దతి కంటనీరు తెప్పిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
తాజాగా.. సరిగ్గా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంట్లో యజమాని పనిచేసుకుంటూ కూర్చుంది. సడన్‌గా చైర్ లోంచి లేచి ఉన్నట్టుండి కుప్పకూలిపోతుంది. దీనిని గమినించిన ఆమె పెంపుడు కుక్క.. వెంటనే పరిగెత్తుకెళ్లి ఇంట్లోని టాబ్లెట్స్ తీసుకొచ్చి వేస్తుంది. అనంతరం కాసేపటికే ఆమె నార్మల్ పరిస్థితికి వచ్చి లేచి నిల్చుంటుంది. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఇప్పటివరకు ఈ వీడియోకు దాదాపు రెండు కోట్లా 33 లక్షల వ్యూస్ వచ్చాయి.
Dog senses his owner is about to faint, who has postural tachycardia syndrome, so he helps her by guiding her to sit down and bringing water and medicine..🐶🐾🙏❤️📹 foIIow tk/ig•serviceaussiebailey pic.twitter.com/KhjgXXnlNh
— 𝕐o̴g̴ (@Yoda4ever) January 26, 2024