రాజమౌళి ప్రకాశ్ రాజ్‌ను తన సినిమాల్లో తీసుకోక పోవడానికి కారణం ఏంటో తెలుసా?

తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విలన్ పాత్ర అయినా, తండ్రి పాత్ర అయినా, తాత పాత్ర అయినా, ఏ పాత్రలోనైన ప్రకాశ్ రాజ్

Update: 2023-03-16 03:35 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విలన్ పాత్ర అయినా, తండ్రి పాత్ర అయినా, తాత పాత్ర అయినా, ఏ పాత్రలోనైన ప్రకాశ్ రాజ్ ఇట్టే ఒదిగిపోతాడు. అందుకే ఆయన ప్రతి స్టార్ హీరో సినిమాలో తప్పకుండా ఉంటాడు, ప్రతి డైరెక్టర్ ఆయనను సినిమాలో తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతారు.

కానీ రాజమౌళి మాత్రం తన సినిమాలో ఎక్కువగా ప్రకాశ్ రాజ్‌కు అవకాశం ఇవ్వలేదు.విక్రమార్కుడు సినిమాలో చిన్న పాత్ర తప్పితే, ఇంత వరకు రాజమౌళి ప్రకాశ్ రాజ్‌కు తన సినిమాలలో అవకాశం ఇవ్వలేదు.

అయితే ఈ విషయంపై రాజమౌళిని అడగగా, ఆయన ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. రాజమౌళి మాట్లాడుతూ.. ఇంత వరకు ప్రకాశ్ రాజ్ చేయని పాత్ర అంటూ లేదు, ఆయన్ను రొటీన్ పాత్రల్లో చూపించడం నాకిష్టం లేదు. ప్రకాష్ రాజ్ ఇంత వరకూ చేయని ఏదైనా పాత్ర ఉంటే తప్పని సరిగా నా సినిమాలో చేయించుకుంటా అని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News