క్లింకార ముద్దు పేరేంటో తెలుసా? మెగా ఫ్యామిలీ ఏమని పిలుస్తారంటే?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. అపోలో ఆసుపత్రి చైర్మన్ మనవరాలు ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
దిశ, సినిమా: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. అపోలో ఆసుపత్రి చైర్మన్ మనవరాలు ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లైన పదేళ్లకు అపోలో హాస్పిటల్లో పండంటి ఆడబిడ్డకు జన్మినిచ్చారు. ఈ మెగా ప్రిన్స్ రాకతో మెగా ఫ్యామిలీ ఇంట సంబరాలు అంబరాన్నంటాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి ఆనందానికి అవధులు లేవనడంలో అతిశయోక్తి లేదు.
మెగా ఫ్యాన్స్ కూడా ఇప్పుడు పుట్టిన బుజ్జాయికి అభిమానులు అయిపోయారు. ఈ అమ్మడుకు క్లింకార అని నామకరణం చేశారు. తరచూ క్లింకారకు సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. మొన్నటి వరకు క్లింకార రాకతో మెగా హీరోలకు బాగా కలిసి వస్తుందని నెట్టింట చర్చించుకున్నారు. రీసెంట్గా అల్లు అర్జున్ జాతీయ అవార్డు, మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషన్ రావడంతో క్లింకార మెగా ఫ్యామిలీలోకి ఎంట్రీ ఇచ్చిన వేళా విశేషమే అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హంగామా చేశారు.
అయితే ఈ స్టార్ కిడ్ నిక్ నేమ్ ఏంటని మెగా ఫ్యాన్స్‌కు పెద్ద డౌట్ వచ్చింది. ఇటీవల ఉపాసన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ బుజ్జాయిని కారా.. అని సంబోధించడం వినిపించిందంటూ అభిమానులు వైరల్ చేస్తున్నారు. అలాగే క్లింకారను రామ్ చరణ్.. నాన్న కూచీ అంటారని.. ఆయనకు బాగాఎమోషనల్ గా కలెక్ట్ అయ్యిందని, చరణ్ ను చూడగానే స్పెషల్‌గా నవ్వుతుందని ఉపాసన మరో సందర్భంలో చెప్పిందంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చర్చిస్తున్నారు.