'సీతా రామం' కథ ఎలా పుట్టిందో తెలుసా?

చిన్న సినిమాగా వచ్చి ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరి సంచలనం సృష్టించిన సినిమా ' సీతా రామం'.

Update: 2022-09-12 12:12 GMT

దిశ, సినిమా: చిన్న సినిమాగా వచ్చి ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరి సంచలనం సృష్టించిన సినిమా ' సీతా రామం'. హను రాఘవపూడి డైరెక్షన్‌‌‌లో సీతారాములుగా దుల్కర్, మృణాల్ కనిపించగా.. రష్మిక కీలకపాత్రలో నటించింది.ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్‌‌లోనూ హంగామా చేస్తోంది. ఇదిలా ఉంటే 'సీతా రామం' సినిమా కథ రామ్‌ రాసిన ఓ లేఖ చుట్టూ తిరుగుతుంది. రామ్‌ రాసిన లేఖ 20 ఏళ్ల తర్వాత సీతకు ఎలా చేరింది.? అసలు ఆ లేఖలో ఏముంది.? అన్నదే ఈ సినిమా కథ.

అయితే అసలు లెటర్‌తో సినిమా అనే ఆలోచన రాఘవపూడికి ఎలా వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. డైరెక్టర్‌కు హైదరాబాద్‌ కోఠిలో లభించే సెకండ్‌ హ్యాండ్‌ పుస్తకాలను కొనే అలవాటు ఉంది. అలా ఓ రోజు ఒక పుస్తకాన్ని కొని చదువుతున్న క్రమంలో పేజీల మధ్యలో అతనికి ఓ లేఖ కనిపించింది. అయితే ఆ లేఖ అప్పటికీ ఓపెన్‌ చేసి లేదు. హైదరాబాద్‌లో చదుతున్న ఓ కుర్రాడికి ఊర్లో ఉన్న తన తల్లి పంపించిన లేఖ. కాగా ఈ సంఘటన 'సీతా రామం' కథకు బీజం పడేలా చేసింది. ఒక వ్యక్తికి పంపిన లేఖ, చివరికి అతనికి చేరిందా? లేదా? అన్న ఆలోచనలో నుంచే 'సీతా రామం' సినిమా పుట్టుకొచ్చిందని చెప్పారు.

Tags:    

Similar News