Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లోకి ఒక సామాన్యుడు వెళితే ఎంత ఇస్తారో తెలుసా? అస్సలు ఊహించి ఉండరు!

బిగ్ బాస్.. బిగ్ బాస్.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రియాలిటీ షోనే ట్రెండింగ్ అవుతోంది.

Update: 2024-08-04 04:11 GMT

దిశ, సినిమా: బిగ్ బాస్.. బిగ్ బాస్.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రియాలిటీ షోనే ట్రెండింగ్ అవుతోంది. తాజాగా ఈ షో కి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ చేశారు. అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం అంటూ అనౌన్స్ చేశారు. ఈసారి కూడా దాదాపుగా సెప్టెంబర్ నెలలోనే వస్తుంది అనే విషయం అయితే అర్థమవుతోంది. ప్రస్తుతానికి సెట్ వర్క్, కంటెస్టెంట్స్ సెలక్షన్ విషయంలో నిర్వాహకులు బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బిగ్ బాస్ షోకి వెళ్లడం చాలా మంది కల. ఇక సామాన్యుడు హౌస్‌లో అడుగుపెట్టడం అంత సులభం కాదు. ప్రతి సీజన్‌కి 20 మంది మాత్రమే కంటెస్టెంట్స్‌గా ఎంపిక అవుతారు. వారిలో ఒక్కరు లేదా ఇద్దరు కామనర్స్ ఉంటారు. కొన్ని సీజన్స్‌లో సామాన్యులకు చోటు కూడా దక్కలేదనే విషయం తెలిసిందే. మరి ఒక కామనర్ బిగ్ బాస్ షోలోకి వెళితే ఎంత చెల్లిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బేసిక్‌గా హౌస్‌లో అడుగుపెట్టాలని చాలామందికి ఉంటుంది. కానీ, సీజన్‌కి 20 లేదా 21 మందికి మాత్రమే వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఈ 20 మందిలో ఒకరిద్దరు సామాన్యుల కోటాలో హౌస్‌లోకి వెళ్లే ఛాన్స్ దక్కించుకోవచ్చు. అలా ఫస్ట్ టైమ్ తెలుగులో గణేష్ అనే యంగ్ ఫెలో సీజన్ 2లో కామనర్‌గా హౌస్లో అడుగుపెట్టాడు. దాని తర్వాత నూతన్ నాయుడు, ఆదిరెడ్డి, గీతూ రాయల్, పల్లవి ప్రశాంత్‌ వంటి వారు ఆ లిస్ట్‌లో చేరిపోయారు. అయితే వీరందరిలో పల్లవి ప్రశాంత్ సంచలనం సృష్టించాడు. హిందీతో పాటు పలు ప్రాంతీయ భాషల్లో బిగ్ బాస్ షో ప్రసారం అవుతుంది. కానీ ఓ కామనర్ బిగ్ బాస్ టైటిల్ కొట్టిన దాఖలాలు లేవు. కానీ పల్లవి ప్రశాంత్ సీజన్ విన్నర్ అయి ఈ రికార్డు తిరగరాశాడు.

అయితే బిగ్ బాస్ హౌస్‌లో ఒక కామనర్‌కి ఎంత రెమ్యూనరేషన్ ఇస్తారో మాజీ కంటెస్టెంట్ ఆదిరెడ్డి లీక్ చేశాడు. బిగ్ బాస్‌లో 15 వారాలు ఉన్న ఆదిరెడ్డికి రూ. 25-30 లక్షలు రెమ్యూనరేషన్‌గా ముట్టాయట. అంటే వారానికి దాదాపు రూ. 2 లక్షలు ఆదిరెడ్డికి బిగ్ బాస్ నిర్మాతలు చెల్లించారు. కంటెస్టెంట్‌గా ఎంపిక అయ్యాక రెమ్యూనరేషన్ బేరసారాలు జరుగుతాయట. టాప్ సెలెబ్స్ అధికంగా డిమాండ్ చేస్తారు. మరి ఆదిరెడ్డికే రూ. 30 లక్షలు ఇస్తే… హీరోలు, హీరోయిన్స్, బుల్లితెర నటులు భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటారని తెలుస్తోంది. కాగా కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్ అనేది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. కంటెస్టెంట్ ఫేమ్, ఫాలోయింగ్, డిమాండ్ చేసిన తీరుపై ఆధారపడి ఉంటుంది.

Tags:    

Similar News