రామోజీరావు గొప్ప నటుడు.. ఆయన నటించిన సినిమా ఏదో తెలుసా?

రామోజీ రావు గురించి ఎంత చెప్పినా తక్కువే. నేడు ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో రామోజీరావుకు సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆయన లైఫ్ స్టోరీ, తాను ఎలా వ్యాపారాల్లో ఎదిగారు,

Update: 2024-06-08 08:41 GMT

దిశ, సినిమా : రామోజీ రావు గురించి ఎంత చెప్పినా తక్కువే. నేడు ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో రామోజీరావుకు సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆయన లైఫ్ స్టోరీ, తాను ఎలా వ్యాపారాల్లో ఎదిగారు, రామోజీ ఫిల్మ్ సిటీ స్థాపించడం ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతున్నాయి. అయితే తాజాగా రామోజీరావుకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది ఏమిటంటే?

రామోజీరావు అందరికి ఓ గొప్ప వ్యాపార వేత్తగా, ఈటీవీ అధినేతగా, పత్రికా సంపాదకులుగా, ప్రచురణకర్తగా, సినీ నిర్మాతగా మాత్రమే తెలుసు. కానీ ఆయన కూడా ఓ నటుడు అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. రామోజీరావు కూడా ఓ సినిమాలో నటించారంట. ఇంతకీ ఆ సినిమా ఏదీ అనుకుంటున్నారా? దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రామోజీరావుకు చిన్న తనం నుంచే నటాకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన తన బాల్యంలో వాటిల్లో పాల్గొనే వారు. ఈ క్రమంలోనే ఈయన ఒక సినిమాలో అతిథిగా నటించారు. యు. విశ్వేశ్వరరావు 1978లో నిర్మించిన మార్పు సినిమాలో ఆయన న్యాయమూర్తి పాత్ర పోషించారు. అయితే ఆ సినిమాలో రామోజీరావు అతిథి పాత్రలో నటించినప్పటికీ, సినిమా పోస్టర్లపై మాత్రం ఆయన ఫొటోలను కూడా ప్రచురించారు. కాగా, ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Tags:    

Similar News