Directors ను ప్రేమించి పెళ్లి చేసుకున్న Heroines ఎవరో తెలుసా?
సినిమా ఇండస్ట్రీలో లవ్ స్టోరీస్గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరో హీరోయిన్స్ లవ్ చేసుకోవడం.. కొందరు పెళ్లి పీటలెక్కుతే మరికొందరు
దిశ, వెబ్డెస్క్ : సినిమా ఇండస్ట్రీలో లవ్ స్టోరీస్గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరో హీరోయిన్స్ లవ్ చేసుకోవడం.. కొందరు పెళ్లి పీటలెక్కుతే మరికొందరు మధ్యలోనే బ్రేకప్ చెప్పు కోవడం సహజం. కానీ అప్పట్లో చాలా మంది నటీనటులు తమ లవ్ సక్సెస్ చేసుకొని ఇప్పటికీ హ్యాప్పీగా ఉంటున్నారు అనడానికి నాగార్జున అమల, శ్రీకాంత్ ఊహా ఇలా చాలా మందిని ఉదహరణగా చెప్పవచ్చు. కానీ హీరోలనే కాదండోయ్.. దర్శకులను లవ్ చేసి పెళ్లి చేసుకొని ఇప్పుడు సంతోషంగా ఉంటున్న హీరోయిన్స్ ఉన్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్, ఒకప్పటి స్టార్ డైరెక్టర్ కృష్ణ వంశీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అలాగే ఎంతో అనుకువగా కనిపించే హీరోయిన్ సుహాసిని డైరెక్టర్ మణిరత్నాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అలాగే గ్లామరస్ హీరోయిన్ రోజా దర్శకుడు సెల్వమణిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. స్టార్ హీరోయిన్ గా రాణించిన కుష్భు కూడా తమిళ దర్శకుడు సుందర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
ఇవి కూడా చదవండి : 'అవతార్ 2' 12 డేస్ కలెక్షన్స్ రూ. 8,277 కోట్ల !