భారతదేశం నా రెండో ఇల్లు లాంటిది : DJ స్నేక్
ఫ్రెంచ్ మ్యూజిక్ ప్రొడ్యూసర్, 'DJ స్నేక్'గా ప్రసిద్ధి చెందిన 'విలియం సమీ ఎటియెన్నే గ్రిగాసిన్'.. భారతీయ సంస్కృతిపై ప్రశంసలు కురిపించాడు.
దిశ, సినిమా : ఫ్రెంచ్ మ్యూజిక్ ప్రొడ్యూసర్, 'DJ స్నేక్'గా ప్రసిద్ధి చెందిన 'విలియం సమీ ఎటియెన్నే గ్రిగాసిన్'.. భారతీయ సంస్కృతిపై ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం 'సన్బర్న్' మ్యూజిక్ షోతో భారత పర్యటనలో ఉన్న ఆయన భారతీయ ప్రేక్షకుల నుంచి లభించే భారీ స్పందన తనను మరింత ముందుకు నడిపించే అంశాల్లో ఒకటిగా పేర్కొన్నాడు. అలాగే ఇక్కడ మనుషుల ప్రేమ తనను మళ్లీ మళ్లీ ఇండియాకు తిరిగొచ్చేలా ఆకర్షించిందని, నిజాయితిగా చెప్పాలంటే ఇక్కడి ప్రేక్షకులు అందిచే శక్తి అద్భుతమైన విషయాల్లో ఒకటన్నాడు.
'భారతదేశం నాకు రెండో ఇల్లు లాంటిది. ఇక్కడ ఊహించిన దానికంటే గొప్పగా స్వాగతించబడ్డాను. కొత్త నగరాలను సందర్శించడం, ఎంతో మంది కొత్త వ్యక్తులను కలవడం, సంగీతాన్ని వినడం నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. ఇలాంటి దేశాన్ని చూసి, అనుభవించినందుకు సంతోషిస్తున్నా' అని చెప్పాడు. అంతేకాదు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అభిమానిగా భవిష్యత్తులో ఆమెతో కలిసి ట్రాక్ చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. నవంబర్ 20న హైదరాబాద్లో జరిగిన ఈ షో.. 26న ముంబయి, 27న బెంగళూరుతో ముగియనుంది.