చీరకట్టులో గోల్డెన్ బ్యూటీలా మెరిసిపోతున్న దిశా పటాని.. తెగ పొగిడేస్తున్న నెటిజన్లు
బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటాని ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఏడి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటాని ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఏడి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో కీలక పాత్రలో కనిపించిన ఈ అమ్మడు తన నటనతో ప్రశంసలు, విమర్శలు అందుకుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ తన పోస్టులతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ క్రమంలో.. తాజాగా, దిశా పటాని తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా గోల్డ్ కలర్ చీరలో ఉన్న పిక్స్ షేర్ చేసింది. క్రీమ్, గోల్డ్ కలర్ చీరకట్టులో ఎద అందాలు చూపిస్తూ స్టన్నింగ్ స్టిల్స్ ఇచ్చింది. ప్రజెంట్ దిశా పటాని ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. వాటిని చూసిన వారంతా అమ్మడు అందాలకు ఫిదా అవుతూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇన్నాళ్లు బోల్డ్ లుక్‌తో కనిపించే దిశా పటాని చీరలో కనిపించడంతో కొందరు ఆశ్చర్యపోతున్నారు.