తన చేతిపై ఉన్న ‘PD’ టాటూ గురించి దిశా పటాని షాకింగ్ పోస్ట్..
బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటాని వరుణ్ తేజ్ లోఫర్ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటాని వరుణ్ తేజ్ లోఫర్ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898ఏడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ జూన్ 27న థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. అలాగే కలెక్షన్స్ పరంగానూ భారీగా రాబడుతుంది. ఇప్పటికే రూ. 500 కోట్ల గ్రాస్‌ను దాటేసి బాక్సాఫీసు వద్ద సునామీ సృష్టిస్తుంది. అయితే ఇందులోని దిశా పటాని నటనకు కొందరు ప్రశంసలు కురిపిస్తే.. మరికొందరు మాత్రం విమర్శలు చేశారు. ఈ క్రమంలో.. దిశా పటాని తన చేతిపై PD అనే టాటూ వేయించుకుని కనిపించింది.
దీంతో P అంటే ప్రభాస్, D అంటే దిశా పటాని అని నెట్టింట పలు ప్రచారాలు జరిగాయి. కల్కి షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడటంతో ఇద్దరి పేరును షార్ట్ కట్‌లో వేయించుకుందని అంతా నెట్టింట చర్చించుకున్నారు. తాజాగా, ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఫొటో షేర్ చేస్తూ షాకింగ్ పోస్ట్ పెట్టింది. ‘‘ నేను వేసుకున్న టాటూ గురించి ఇంతమంది క్యూరియాసిటీ చూపించడం చాలా ఆనందంగా అనిపించింది. ఆనందం అంటే ఏంటో ముందు కనుగొనండి’’ అని రాసుకొచ్చింది. ప్రజెంట్ అమ్మడు పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన వారు PD అంటే దిశా పటాని రివర్స్ వేసుకున్నారా? అని కామెంట్లు పెడుతున్నారు.
Read More..
అబ్బాయిలతో రూమ్ షేర్ చేసుకున్నా.. బట్టలు అలా మార్చుకునేదాన్నంటూ షాలిని పాండే ఎమోషనల్ కామెంట్స్