'సూర్య 42'లో ఊహకందని అంశాలు: ఎగ్జయిట్‌ అవుతున్న దిశా

బోల్డ్ బేబీ దిశా పటానీ కోలీవుడ్ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ మేరకు 'సూర్య 42'లో నయా లుక్‌లో కనిపించనున్నట్లు చెప్పిన బ్యూటీ ఇందులో ఊహకందని అంశాలు ఉన్నట్లు వెల్లడించింది..Latest Telugu News

Update: 2022-09-10 09:02 GMT

దిశ, సినిమా: బోల్డ్ బేబీ దిశా పటానీ కోలీవుడ్ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ మేరకు 'సూర్య 42'లో నయా లుక్‌లో కనిపించనున్నట్లు చెప్పిన బ్యూటీ ఇందులో ఊహకందని అంశాలు ఉన్నట్లు వెల్లడించింది. 'సూర్య అండ్ శివగారితో నా తదుపరి చిత్రాన్ని ప్రకటించడం ఆనందంగా ఉంది. లార్జర్ ద్యాన్ లైఫ్ ఎలిమెంట్స్‌తో కూడిన భారీ ప్రాజెక్ట్‌లో భాగం కావడం గొప్ప అవకాశంగా భావిస్తున్నా. నేను పోషిస్తున్న పాత్ర కూడా ఎంతో ప్రత్యేకమైనది.

ఇంతకుముందెన్నడూ కనిపించని అవతార్‌ని ప్రేక్షకులకు చూపించాలని ఎగ్జయిట్‌గా ఉంది' అని ఆనందంగా చెప్పుకొచ్చింది. ఇక ఈ మూవీ మోషన్ పోస్టర్‌ను సెప్టెంబరు 9న మేకర్స్ విడుదల చేయగా.. గుర్రాలపై స్వారీ చేస్తూ కత్తులు, గొడ్డళ్లతో యోధులు చేస్తున్న పోరాటం ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. అలాగే తాత్కాలిక టైటిల్ 'సూర్య 42'తో 3Dలో రూపుదిద్దుకుంటున్న మూవీ 10 భాషల్లో విడుదల కానుంది. 

Also Read : 'మీరు ఊహించగలిగేదంతా నిజమే'.. అనన్య మిర్రర్ సెల్ఫీ 


Similar News